Search

Tuesday, 22 January 2013

త్రిష డ్రింక్ సెంటిమెట్ : నేను.. తాగి నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్టే!

trishaసినీ నటి త్రిషకు మద్యం సేవించే అలవాటు ఉన్నట్టు కోలీవుడ్, టాలీవుడ్ మీడియాలో జోరుగానే ప్రచారం సాగింది. దీన్ని నిజం చేసేలా త్రిష తాజాగా వ్యాఖ్యలు కూడా ఉండటం గమనార్హం. తాను మద్యం సేవించినట్టుగా సన్నవేశాలు ఉండే చిత్రాలన్నీ సూపర్ డూపర్‌హిట్లు అయ్యాయని చెపుతోంది. అందువల్ల తాను నటించే చిత్రాల్లో కూడా దర్శకులు మద్యం సన్నివేశాలు ఉండేలా సీన్లు క్రియేట్ చేస్తున్నారని ఈ చెన్నయ్ చిన్నది చెపుతోంది.

మరోవైపు.. త్రిష చేసిన తాగుడు వ్యాఖ్యలపై వివాదం కూడా చెలరేగింది. హిందూ పీపుల్స్ పార్టీ నేత ముత్తు రమేష్ వంటి వారు విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా తారలను చాలా మంది అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారని, వెండి తెర మీద తాగుడుకు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉండాల్సింది పోయి, మద్యాన్ని సమర్థించే విధంగా సన్నివేశాలు ఉండకూడదని వారు హితవు పలుకుతున్నారు. కాగా, త్రిష నటించిన తాజా తమిళ చిత్రం "సమర్"... తెలుగులో "వేటాడు - వెంటాడు"గా అనువదించనున్నారు.

Google+ Followers