Search

Wednesday, 20 February 2013

పరువు హత్యలు కాన్సెప్టుతో మెగా హీరో చిత్రం

అల్లు అర్జున్‌ సోదరుడు అల్లు శిరీష్‌ హీరోగా త్వరలో 'గౌరవం'అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్‌ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె లాయిర్ గా కనిపించనుంది. ఆమె ఈ పాత్ర గురించి మాట్లాడుతూ... చిత్రం పరువు హత్యలు చుట్టూ తిరుగుతుంది. వాటిని వ్యతికేరిస్తూ వాదించే లాయిర్ గా ఆమె కనింపించనుందని తెలిపింది.
తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన ‘విక్కీ డోనర్'లోనూ హీరోయిన్ గా చేసి అందరి దృష్టిలో పడింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్‌ దర్శకత్వం వహించారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్‌ రాజ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గౌరవం చిత్రాన్ని మొదట నాగచైతన్యతో అనకున్నారు. కథ ఓకే చేసి ఫోటో షూట్ లు సైతం జరిగాయి. కానీ చివరి నిముషంలో ప్రాజెక్టు ఇలా అల్లు శిరీష్ కి చేరింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవుతూండటంతో వర్కవుట్ కాదని దాన్ని నాగార్జున రిజెక్టు చేసినట్లు సమాచారం.allu sirish s gauravam story revealed
ఈ చిత్రం కోసం అల్లు శిరీష్ ఏక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం.అందుకోసమే డైలాగు డిక్షన్, యాక్టింగ్ ఎబిలిటీస్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలని పూర్తి ఎఫెర్ట్ పెడుతున్నారు. భారీగా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ చిత్రం విశేషాలను ప్రకాశ్‌ రాజ్ తెలియజేస్తూ -‘‘డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.

ప్రియమణి ‘చండీ’కి...ఇందిరా గాంధీకి లింకేటి?

హీరోయిన్ ప్రియమణి ‘చండీ' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక సామాన్యురాలు మంత్రిగా ఎలా ఎదిగింది? అనేది కథాంశం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ విడులయ్యాయి. ఇందులో బ్యాక్ డ్రాప్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫోటో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రియమణి పాత్ర ఇందిరా గాంధీ స్వభావాన్ని పోలి ఉంటుందా? ఇందిరా గాంధీలా కొందరికి ఆమె పాత్ర కొరకరాని కొయ్యలా ఉంటుందా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా మాజీ ప్రధాని ఇందర నేపథ్యాన్ని ప్రస్పుటిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రియమణి ధైర్య వంతురాలుగా, డేరింగ్ లేడీగా కనిపించనుంది. ఇందులో ఆమె గుర్రపు స్వారీ, ఆర్చరీ లాంటి విద్యలను పదర్శించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా విభాగాల్లో శిక్షణ కూడా తీసుకుంటోంది.

Photos : సిసిఎల్ 3 తర్వాత పార్టీ....హాట్ హీరో,హీరోయిన్స్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో వెంకటేష్ నేతృత్వంలో తెలుగు వారియర్స్ టీం వరుసగా రెండో విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఉత్సాహంగా అంతా ఆ రోజు రాత్రి పార్టీకి హాజరయ్యారు. పార్టీ అనంతరం ఇలా మీడియా కళ్లకు చిక్కారు. ఆ పార్టీ స్టార్ హీరోలు,హీరోయిన్స్ తో కళకళ్ళాడింది.
బెంగాల్ టైగర్స్ పై విజయం సాధించిన తెలుగు వారియర్స్ టీం, ఆదివారం ముంబై హీరోస్‌తో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ టీం 7 వికెట్ల తేడాతో ముంబై హీరోస్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన వారియర్స్ 17.5 ఓవర్లలో 136 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఆదర్శ్ 36 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ మొత్తం టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు రాకతో అదిరిపోయింది. ఎక్కడ చూసినా కబుర్లే కబుర్లు.

సల్మాన్ ఖాన్, వెంకటేస్, ఇలా స్టార్స్ అంతా ఒక్కచోట చేరి సందడి చేయడంతో పండగ వాతావరణం నెలకొంది. అన్ని చిత్ర పరిశ్రమలు ఒక వేదికపైకి రావడం అరుదైన విషయం. ఈ ఆట ప్రేక్షకులకు చక్కటి వినోదం పంచటమే కాక, స్టార్స్ లోనూ ఆటవిడుపు లాంటి ఉత్సాహం కలగ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం....
పార్టీలో స్టార్స్..ఉత్సాహం..ఉద్వేగం..కబుర్లు

Photos : స్సెయిన్లో ‘ఇద్దరమ్మాయిలతో’ టీంతో జూ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ‘బాద్ షా' చిత్రం ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జూ ఎన్టీఆర్-కాజల్ పై పాటల చిత్రకరణ జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరో వైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘ఇద్దరమ్మయిలతో' చిత్రం షూటింగ్ కూడా స్పెయిన్లోనే జరుగుతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు నిర్మాత బండ్ల గణేష్ కావడం. ఈ రెండు చిత్రాల్ని ఆయన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
రెండు సినిమాల షూటింగులు ఓకే ప్రాంతంలో జరుగుతుండటంతో ‘బాద్ షా' మూవీ యూనిట్ సభ్యులైన హీరో జూ ఎన్టీఆర్, దర్శకుడు శ్రీను వైట్ల, హీరోయిన్ కాజల్ ‘ఇద్దరమ్మాయిలతో' షూటింగ్ లొకేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అంతా కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

సంజయ్‌ దత్‌ చిత్రంపై నిరసనలు,ధర్నాలు

Sanjay Dutt Zilla Ghaziabad Trouble జిల్లా ఘజియాబాద్‌ చిత్రంలో నటించిన ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌కు విరుద్ధంగా మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. పలు సంఘాలు నిరసనలు తెలుపుతూ ఘజియాబాద్‌ గూండాల రాజ్యం కాదంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ఇక్కడ ప్రాణాలు అర్పించేవారు కనిపిస్తారంటూ నినాదాలు చేశారు. ఈ చిత్రం నగరంలోని యువతను నేరాలకు పాల్పడేలా ఉత్తేజం కలిగిస్తుందని పేర్కొన్నారు.

మరో ప్రక్క ఘజియాబాద్‌ ప్రాంతంమీద తీసిన 'జిల్లా ఘజియాబాద్‌' చిత్రం గురించి కథారచయిత వినయ్‌ శర్మ, డైరెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ సహిబాబాద్‌ ప్రాంతంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ చిత్రంలో అవమాన పరిచేవిధంగా ఎలాంటి సన్నివేశాలు లేవన్నారు. పోలీస్‌ అధికారిగా నటించిన శీతక్‌ సింగ్‌, గ్యాంగ్‌వార్‌లో ప్రధాన భూమిక పోషించిన మహేంద్ర పౌజీ, సత్‌వీర్‌ గుర్జర్‌తోపాటు రచయిత వినయ్‌ శర్మ ఈప్రాంతానికి చెందినవారే కావటం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.
తాము ఈప్రాంతానికి చెందిన వాళ్లం కాబట్టి ఘజియాబాద్‌ కించపర్చాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదన్నారు. ఘజియాబాద్‌ అతి కష్టం మీద మోడ్రన్‌ మెట్రో కల్చర్‌ ప్రాంతంగా మారిందని, మీరు మళ్లీ ఘజియాబాద్‌ ప్రాంతం నేరాలకు అడ్డాగా తయారు చేస్తున్నారని ఒక విలేకరి అభిప్రాయపడ్డాడు. దీనివలన ప్రాపర్టీ విలువ కూడా పడిపోతుందని అన్నాడు. దీనికి డైరెక్టర్‌ సమాధానమిస్తూ చిత్రం ద్వారా ఘజియాబాద్‌ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తుందని, ఇది ఉత్తరప్రదేశ్‌కు కూడా మంచిదేనని తెలిపారు. ఈ చిత్రంలో నేరాలుకు సంబంధించిన అంశాలు చాలా తక్కువగా కామెడీ ప్రధానంగా వుందని వెల్లడించారు.
ఘజియాబాద్‌లోని రెండు శత్రువర్గాల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగానే 'జిల్లా ఘజియాబాద్‌' చిత్రం రూపొందించారని తెలుస్తోంది. అయితే దర్శకుడు ఆనంద్‌కుమార్‌ అయితే ''ఒక సాధారణ కథలోని సంఘటనలు ఏరుకుని దానికి మెరుగులుదిద్ది ఒక కమర్షియల్‌ చిత్రం ఇతివృత్తంగా రూపొందించామే గాని, ఈ చిత్రం ఎవరి ఆత్మకథ కాదు'' అని ఆ మధ్య అన్నారు. అంతేకాదు తాను రైల్వేస్టేషన్లో ఓ సాయంత్రం నిరీక్షిస్తుంటే టీవి స్క్రీన్‌ మీద పడే సూర్య కిరణాల మధ్య పసుపురంగు బోర్డ్‌పై 'జిల్లా ఘజియాబాద్‌' అని కనిపించడం ఓ ప్రత్యేక అనుభూతిని యిచ్చిందని ఆక్షణాన్నే ఈ టైటిల్‌తో చిత్రం చేయాలనుకుని రిజిస్టర్‌ చేయించానని ఈ అంశాల గురించి ఒక రాజకీయ మిత్రుడితో చర్చిస్తుంటే ఘజియాబాద్‌కి చెందిన సత్బీర్‌ గుర్జార్‌, మహేందర్‌ ఫౌజీ కథను చెప్పాడని దాన్నించి ప్రేరణ చెంది ఈ కథ తయారు చేసుకున్నామని ఇది కల్పిత కథ అని వాస్తవ సంఘటనలు లేవని చెప్పారు.
ఘజియాబాద్‌ జిల్లాలోని ప్రీతమ్‌సింగ్‌ అనే పోలీస్‌ అధికారి అసాంఘిక శక్తులకు హడల్‌. నేరస్తులను పట్టుకోడానికి, వారి నుంచి నిజాలు రాబట్టడానికి చట్ట పరిధిలోలేని అంశాలను, పోలీసులు ఉపయోగించని చిట్కాలు ఉపయోగించి వాళ్ళనుంచి నిజాలు కక్కించేవాడు. అతడు చనిపోయి పధ్నాలుగు సంవత్సరాలైనా ఆ జిల్లాలోని ప్రజలు మరిచిపోలేదు.
ప్రీతమ్‌సింగ్‌గా సంజయ్‌దత్‌, సత్బీర్‌ గుర్జాల్‌గా వివేక్‌ ఓబెరాయ్‌, మహేందర్‌ ఫౌజిగా అర్షాద్‌ వార్సీ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలిసుకున్న ప్రీతమ్‌సింగ్‌ అభిమానులు, ప్రీతమ్‌సింగ్‌ అన్న ఎస్‌.పి.సింగ్‌ ప్రభృతులు ఈ చిత్రంకి సంబంధించిన ప్రతి అంశం తమకు తెలియాలని ప్రీతమ్‌సింగ్‌ పాత్రను ఎలా తీర్చిదిద్దారో తెలపాలని, చట్టానికి బద్ధుడైన వాడిగానే చూపాలి తప్ప మరోరకంగా చూపడానికి వీల్లేదని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. నిర్మాత వినోద్‌ బచ్చన్‌ అయితే ఈ సినిమా అందరిలోనూ ఉత్కంఠ రేపిన కారణంగా ఎంక్వయిరీలు ఎక్కువగానే ఉన్నాయని గతంలో ఒకసారి చెప్పారు.

విక్రమ్ ‘ఐ' చిత్రం బడ్జెట్ ఎంత?

What The Budget Shankar I ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం ‘ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనేది ఇప్పటికే మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చెన్నై సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు 145 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని వినపడుతోంది. ఇప్పటి వరకూ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజి బడ్జెట్ తో ఏ చిత్రమూ తెరకెక్కలేదని,ఇదే తొలిసారని చెప్తున్నారు.
ఈ విషయాన్ని డిల్లీకి చెందిన ఓ డైలితో విక్రమ్ ఖరారు చేసి చెప్పారు. రజనీతో చేసిన రోబో కన్నా ఈ బడ్జెట్ ఎక్కువ. ఈ చిత్రం త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక్కడ ఓ పాట,కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఇరవై రోజులు షెడ్యూల్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
శంకర్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే. ఈ నేపధ్యంలో ఈ రిపీట్ కాంబినేషన్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ఐ చిత్రం కాన్సెప్ట్ పై రకరకాల కథనాలు వినపడుతున్నాయి. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది.
ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

ఆయన దర్శకత్వంలో నటించటం లేదు : నయనతార ఖండన

Nayanthara Denies Doing Sundar C Project సెకండ్ ఇన్నింగ్స్ ని సూపర్ వేగంతో పరుగెట్టిస్తున్న నయనతార తాను వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, సందర్‌.సి దర్శకత్వంలో తాను నటించటం లేదని స్పష్టం చేసింది. తెరపై రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నయనతార రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతోంది. తమిళంలో అజిత్‌కు జంటగా విష్ణువర్ధన్‌ చిత్రం, ఆర్య సరసన 'రాజారాణి', తెలుగులో నాగార్జునతో 'గ్రీకువీరుడు', గోపీచంద్‌తో మరో సినిమాతో తీరికలేకుండా ఉంది.
రీసెంట్ గా సుందర్‌.సి దర్శకత్వంలో నటించనుందన్న వార్తలు కోడంబాక్కంలో షికార్లు చేశాయి. ప్రస్తుతం విశాల్‌తో 'మదగజరాజా' రూపొందిస్తున్న సుందర్‌.సి. ఆపై సిద్ధార్థతో, అనంతరం 'అరణ్మనై' సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు, ఇందులో నయనతార ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే నయనతార మాత్రం ఈ విషయాన్ని ఖండించింది. 'కొత్త చిత్రానికి సంబంధించి సుందర్‌.సితోఎలాంటి చర్చలు జరపలేదు. ఆయన దర్శకత్వంలో నటించటం ఓ గౌరవం. ప్రస్తుతానికి చేతినిండా సినిమాలతో తీరికలేకుండా ఉన్నాను. సుందర్‌.సి దర్శకత్వంలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని' తెలిపింది.
మరో ప్రక్క బాలీవుడ్ మూవీ ‘కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో నయనతార నటించబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నయనతార ప్రకటన చేసింది. ఓప్రముఖ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ నయనతార ఈ విషయాన్ని ధృవీకరించింది.
‘బాలీవుడ్ మూవీ కహానీ చిత్రానికి రీమేక్ గా తెలుగు, తమిళంలో రూపొందబోయే చిత్రానికి నేను సంతకం చేసారు. ఈచిత్రంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది' అంటూ నయనతార చెప్పిన విషయాన్ని చెన్నయ్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. నయనతార ఈ విషయాన్ని ఇలా అధికారికంగా ప్రకటించడంతో ‘కహానీ' చిత్రంపై ఉన్న ఊహాగానాలకు తెరపడ్డట్లయింది.

కాలం కలిసొస్తోంది : అనూష్క

Anushka Cloud Nine యముడు-2' తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని బొమ్మాళి అనుష్క చెబుతోంది. తెలుగులో ప్రభాస్‌కు జంటగా ఆమె నటించిన సినిమా 'మిర్చి'. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తమిళంలో ప్రస్తుతం సూర్య సరసన 'సింగం-2'లో ఆడిపాడుతోంది. హరి దర్శకత్వంలో గతంలో వారిద్దరూ జంటగా వచ్చిన 'సింగం' చక్కటి ఫలితాన్ని నమోదు చేసింది. దీనికి కొనసాగింపుగా రెండో భాగం సిద్ధమవుతోంది. హన్సిక మరో హీరోయిన్.
అనుష్క మాట్లాడుతూ.. ప్రస్తుతం కెరీర్‌ సంతృప్తికరంగా సాగుతోంది. 'మిర్చి' ఘన విజయం సాధించటం, గుణశేఖర్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమవటం, సూర్యకు జంటగా మరోసారి అవకాశం రావటం నాకు కలిసొస్తున్న విషయాలని చెప్పింది.
భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెప్తూ...కహానీ రీమేక్‌ చిత్రంలో నటించమని శేఖర్ కమ్ముల నన్ను అడిగారు. కాల్షిసట్‌ స ర్దుబాటు కాక చేయలేదు. అయినా అన్ని సినిమాలకు నేనే చేయాలని లేదు కదా. ప్రస్త్తుతం రుద్రమదేవి, బహుబలి సినిమాలు ఒప్పుకున్నాను. వాటిపైనే దృష్టి పెట్టాలి. ఒక సినిమా అంగీకరించే ముందు కథకే ప్రాధాన్యతనిస్తాను. కథ ప్రకారమే పాత్రలు ఉంటాయి. ఇక కాంబినేషన్‌ సినిమాలంటే తొలుత స్కిప్ట్‌ బావుండాలి అప్పుడే అవి విజయం సాధించే అవకాశం ఉంటుంది అని అనుష్క పేర్కొంది.
ఇక నా పెళ్లి విషయంలో మా అమ్మా, నాన్నా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇందులో వాళ్ల ప్రమేయం పెద్దగా ఉండదు. నేను ‘ఓకే' అన్నప్పుడే వాళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు. అంతే తప్ప... నన్ను ఇబ్బంది పెట్టి పెళ్లి చేయరు. కెరీర్ మంచి స్పీడ్ మీద ఉన్న టైమ్‌లో ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకొనే అమాయకురాలిని కాదు నేను అంటోంది అనుష్క.

మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసిన రామ్ చరణ్!

Charan Signs Another Bollywood Film మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్లో ఈచిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన జంజీర్ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, టాలెంట్‌పై పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ....పలు బాలీవుడ్ సినిమాల అవకాశాలు వస్తున్నాయని, పలవురు దర్శక నిర్మాతలు తనకోసం తెచ్చిన స్క్రిప్టులు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు కూడా. తాజాగా బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ రెండో బాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
జంజీర్ సినిమా విషయానికొస్తే...జంజీర్' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ మొదటి ఏప్రిల్ లో అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మే 10కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది.

నాగబాబు కొడుకు ప్రక్కన హీరోయిన్ గా ఆ హీరో కూతురు

మెగా క్యాంప్ నుంచి వస్తున్న మరో హీరో వరుణ్ తేజ్ అని తెలిసిందే. నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ ని శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే గొల్లభామ అనే టైటిల్ కూడా అనుకున్నారు. మరి వరుణ్ తేజ్ ప్రక్కన హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనేదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. కమల్ హాసన్ రెండో కూతురు అక్షరను ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు జంటగా చేయించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆమెకు ఇప్పటికే తమిళ,హిందీ పరిశ్రమల నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె ఓకే చెయ్యలేదు. కానీ మెగా క్యాంప్ హీరో కావటంతో ఓకే చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.
రీసెంట్ గా జరిగిన సిసిఎల్ 3 లో చెన్నై రైనోస్ జట్టుకు మద్దతు ఇవ్వటానికి తన అక్కతో పాటు ఆమె మైదానంలోకి వచ్చి అందరి దృష్టిలో పడింది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నారు. ఆయన కొత్త చిత్రానికి 'గొల్లభామ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. శ్రీకాంత్ అడ్డాల తన తర్వాతి సినిమా నాగబాబు తనయుడు వరుణ్ తేజతో చేయబోతేన్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది.
mega hero pair up with kamal younger daughter
తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం అయితేనే బెటరని నాగబాబు బలంగా నమ్ముతున్నాడని, వరుణ్ తేజ కోసం మంచి కథ రెడీ చేయమని అతన్ని పురమాయించాడని టాక్. గీతా ఆర్ట్స్ బేనర్ పై ఈచిత్రం రూపొందే అవకాశం ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ నటనతో పాటు, సినిమాకుల సంబంధించిన విషయాలపై శిక్షణ తీసుకుంటున్నాడు.
వాస్తవానికి 2008లోనే రవిబాబు ‘నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో తన తనయుడికి కూడా సెంటిమెంటు పని చేస్తుందని నాగాబాబు ఆశ పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

హాట్ న్యూస్ :చెట్టు కింద ప్లీడర్‌గా...పవన్‌కల్యాణ్

Pawan Kalyan As Lawyer Krish Movie త్వరలో పవన్ కళ్యాణ్ చెట్టుక్రింద ప్లీడర్ గా కనిపించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తాజాగా పవన్ ఓ చిత్రం ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ పాత్ర పెద్దగా ప్రాక్టీస్ లేని ఓ లాయిర్ పాత్ర అని తెలుస్తోంది. వినపడుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ కేసు విషయంలో ప్రజాపక్షాన నిలిచి న్యాయాన్ని గెలిపించటం కధాంశమని చెప్తున్నారు.
ఈ స్టోరీ లైన్ నచ్చి వెంటనే స్ట్రిప్ట్ రెడీ చేయమని క్రిష్‌ని పురమాయించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించనున్నారనే వార్త ఇటీవలే వినిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే పవర్‌స్టార్ లాయర్‌గా కనిపించబోతున్నారని ఫిలింనగర్ సమాచారం. పవన్ ఎప్పుడూ విభిన్నమైన స్క్రిప్టులకు ప్రాధాన్యత ఇస్తారనే సంగతి ఈ విషయంతో మరోసారి రుజువైంది.
గతంలో ఎన్టీఆర్ హీరోగా లాయిర్ విశ్వనాధ్ చిత్రం కూడా ఇలాంటి కథాంశంతోనే వచ్చింది. అలాగే రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ దర్శకత్వంలో వచ్చిన చెట్టు క్రింద ప్లీడర్ చిత్రం కూడా ఇలాంటి ఓ సున్నితమైన ఇష్యూని డీల్ చేస్తూ సాగుతుంది. అలాగే చిరంజీవి అభిలాష చిత్రంలో కూడా లాయిర్ గా కనిపించి ఓ బర్నింగ్ టాపిక్ ఇష్యూపై ఆయన పోరాటం చేస్తారు. ఇలాంటి కథలో సామాజిక సందేశం తో పాటు జనాల్ని చైతన్యం చేసే అవకాసం కూడా ఉంటుందని పవన్ భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.

పవన్ కళ్యాణ్ ...ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రిష్, సంపత్‌నంది చిత్రాల్లో నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు సెట్స్‌కి వెళతుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

జిఎంఆర్ టు బండ్ల గణేష్: అందరి లెక్క తేల్చేస్తారా?

It Officers Concentrating On Crorepatis
లక్షాధికారులపై ఐటి శాఖ కన్నేసిందట! ముప్పై లక్షల రూపాయలు అంతకన్నా ఎక్కువ విలువైన ఇల్లు కొనుగోలు చేసిన, బ్యాంకులో రూ.10 లక్షల కన్నా ఎక్కువ నగదు డిపాజిట్లు చేసిన వారి చిట్టా సేకరించిందట. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లింపులో లొసుగులను సరి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఐటి(ఆదాయపు పన్ను) శాఖను ఆదేశించింది.
ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున పేరుకు పోయిన ద్రవ్యలోటు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లు అవసరమైన నేపథ్యంలో లొసుగులు సరి చేయాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఐటి శాఖ జల్సారాయుళ్ల పైన, ఆదాయానికి మించి ఖర్చు చేసేవారి పైన, ఆదాయానికి తగ్గ పన్ను కట్టనివారి పైన కన్ను వేసింది. బ్యాంకుల్లో భారీ మొత్తం నగదు నిల్వ ఉండటం, రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడం, విరివిగా క్రెడిట్ కార్డులు వాడటం వంటివి చేసే వారిపై ఐటి శాఖ కన్నేసింది!
ఈ మేరకు మన రాష్ట్రంలోనే లక్షన్నర మందితో కూడిన ఓ జాబితాను ఐటి శాఖ అధికారులు సిద్ధం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఎవరిపై దృష్టి పెట్టాలనే అంశానికి సంబంధించి ఐటి శాఖ ఏడు ప్రమాణాలను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాలోని వ్యక్తులు లేదా సంస్థలు చేసే వ్యయానికి, చెల్లించే ఆదాయ పన్నుకు మధ్య పొంతన కుదరట్లేదు. దీంతో వీటి అసలు లెక్క ఏమిటో తేల్చేందుకు ఐటి అధికారులు సిద్ధమవుతున్నారట.
ఇందులో భాగంగా కొద్దిరోజుల క్రితం జిఎంఆర్, రాంకీలపై, ఇటీవలే సినీ నిర్మాత బండ్ల గణేష్ పైనా దాడులు చేసి తొలి దశలో రూ.కోటి ముందస్తు పన్ను కట్టించుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఇలా ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించని వారి వివరాలను ఐటి అధికారులు ఇప్పటికే సేకరించి పెట్టుకున్నారట. వీటి ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున అదనపు ఆదాయం పొందేందుకు వీలుగా ఐటి శాఖ కసరత్తు కూడా చేస్తోందట.
ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారట. అయితే, ఐటి శాఖ ప్రధాన లక్ష్యం దాడులు కాదనీ లెక్క ప్రకారం పన్ను చెల్లించని వారి నుంచి అదనపు ఆదాయం పొందడమేననీ తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో తాము తయారు చేసిన జాబితాలోని వారికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. అప్పటికీ పన్ను చెల్లించేందుకు ముందుకు రాకపోతే, అప్పుడు దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయట.

Google+ Followers

Popular Posts