
విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ‘షాడో' చిత్రం రిలీజ్ మరోసారి
వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకరాం ఈ చిత్రాన్ని
ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో
ఈచిత్రాన్ని మార్చి 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 28కి
వాయిదా వేసారు. ఏమైదో ఏమో కానీ ఇప్పుడు ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని
చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
ఉంది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం శరవేగంగా షూటింగ్
జరుపుకుంటోంది. వెంకీతో పాటు ఈ చిత్రంలో శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర
పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా
మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ
చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న
ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు
అందిస్తున్నారు.
షాడో' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచంలోని ఆరు వేర్వేరు
ప్రదేశాల్లో ఈచిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్,
ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్,
గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్ర్కిప్టు రూపొందించారని తెలుస్తోంది.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి,
ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర
పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు:
కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల,
ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్.
ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ. మరో వైపు వెంకీ ఈ చిత్రంతో
పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి
తెలిసిందే.