Search

Thursday, 21 February 2013

నాగ్ ‘గ్రీకు వీరుడు’ రిలీజ్‌పై నిర్మాత ప్రకటన

Producer Confirms Greeku Veerudu Release కింగ్ నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం ‘గ్రీకు వీరుడు'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్ర నిర్మాత చందన్ రెడ్డి మాట్లాడుతూ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. అడియో విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదని, త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
గ్రీకు వీరుడు'లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.
మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

‘మిస్టర్ పెళ్లి కొడుకు’ సెన్సార్ రిపోర్ట్-రిలీజ్ వాయిదా

Mr Pellikoduku Censored Release Postponed సునీల్ హీరోగా రూపొందుతున్న ‘మిస్టర్ పెళ్లి కొడుకు' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి క్లీన్ ‘U' సర్టిఫికెట్ జారీ చేసింది. దేవి ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగాసూపర్ గుడ్ ఫిలింస్ సంస్థపై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. హిందీలో హిట్టయిన ‘తను వెడ్స్ మను' చిత్రానికి ఇది రీమేక్.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేస్తామని ఆ మధ్య ప్రకటించినప్పటికీ తాజాగా రిలీజ్ డేట్ మార్చారు. మార్చ్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ...‘ఇటీవల విడుదలైన మిస్టర్ పెళ్లి కొడుకు ఆడియోకు మంచి స్పందన వస్తోంది. సునీల్ తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. సునీల్-ఇషా చావ్లా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది' అన్నారు.
మరో నిర్మాత పారస్ జైన్ మాట్లాడుతూ ‘సునీల్‌తో మా సంస్థ తీసిన అందాల రాముడు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం కూడా మాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది' అన్నారు. సునీల్ సరసన ఇషా చావ్లా నటించిన ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్.బి.శ్రీరామ్, ఆహుతిప్రసాద్, రవిబాబు, ఎం.ఎస్. నారాయణ, తులసి, ఉషశ్రీ, అర్చన, భవాని ముఖ్య పాత్రలు పోషించారు. విలన్ గా విన్సెంట్ అనే కొత్త నటుడు పరిచయం అవుతున్నాడు.
ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్, కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎం.ఎస్. రవికుమార్, ఫైట్స్: కనల్ కణ్ణన్, ఎడిటింగ్: నందమూరి హరి, కో డైరెక్టర్స్: ఎన్.బ్రహ్మాజీ, విజయ్ కుమార్, ప్రొడక్షన్: భీమనేని రాయుడు, సమర్పణ: ఆర్.బి.చౌదరి, నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవిప్రసాద్.

హీరోయిన్లు సెక్సీగా @ సౌత్ స్కోప్ క్యాలెండర్ లాంచ్(ఫోటోలు)

సౌత్‌లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన మేగజైన్లలో ‘సౌత్ స్కోప్' మేగజైన్ కూడా ఒకటి. ఈ మేగజైన్ వారు ప్రతి సంవత్సరం దక్షిణాదిన బాగా పాపులారిటీ కలిగిన హీరోలు, హీరోయిన్లు, ఇతర ఫిల్మ్ స్టార్లతో ప్రత్యేక మైన ఫోటో షూట్ చేపట్టి క్యాలెండర్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 2013 సంవత్సరంలో కూడా ‘సౌత్ స్కోప్' క్యాలెండర్ ను విడుదల చేసారు.
ఇందుకు సంబంధించిన కార్యక్రమం బుధవారం చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. సినీ స్టార్స్ విశాల్, గౌతం కార్తీక్, తాప్సీ, వరలక్ష్మి శరత్‌కుమార్, శ్రీయ రెడ్డి, వెంకట్రాం, ఇనియా, శ్రవంతి తదితరులు హాజరవ్వంతో పాటు తమ సెక్సీ ఒంపుసొంపులతో ర్యాంప్ వాక్ చేసారు. వాస్తవారికి ఈ క్యాలెండర్ చాలా రోజుల క్రితమే విడుదల చేయాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల లేటయిందని నిర్వాహకులు అంటున్నారు.
సౌత్ స్కోప్ క్యాలెండర్‌ గతంలో మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచింది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ అప్పట్లో ఈ మేగజైన్ నిర్వాహణ బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో భారీగా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టార్లతో పోటోషూట్లు లాంటి చేపట్టడంతో పాటు మీడియాలో ఈ మేగజైన్‌కు బాగా ప్రచారం కల్పించారు. అయితే ఆ తర్వాత తీవ్ర నష్టాలు పాలు కావడంతో దీన్ని వేరే వారికి అమ్మేశారని టాక్.
2013 సౌత్ స్కోప్ మేగజైన్ క్యాలెండర్ ఆవిష్కణ కార్యక్రమం ఫోటోలు:

ఆసుప్రతి పాలైన షర్మిల, ఫుడ్ పాయిజనింగే!

Sharmila Tagore Hospitalised బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తల్లి, ప్రముఖ నటి షర్మిల ఠాగూర్ ఆసుపత్రి పాలయ్యారు. ఆమె తిన్న ఆహారం విషతుల్యం కావడం వల్లనే షర్మిల ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల తన భర్త, కీ.శే. మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపాన్యాస సభకు హాజరు కాలేక పోతున్నారు.
ఈ విషయమై షర్మిల పిటిఐతో మాట్లాడుతూ, తన భర్త స్మారకోపాన్యాస సభకు హాజరు కాక పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ‘చెన్నయ్‌లో జరుగుతున్న నా భర్త స్మారకోపన్యాస సభకు హాజరు కాలేక పోవడం ఎంతో దురదృష్ణ కరం. నేను తిన్న ఆహారం విషతుల్యం కావడం వల్ల ఆసుపత్రిలో ఉన్నాను. ఇందుకు ఎంతో చింతిస్తున్నాను' అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.
షర్మిల ఠాగూర్‌కు వీలు కాక పోయినా, ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా హాజరవుతారా? అని ఆమెను ప్రశ్నించగా, తన కొడుకు సైఫ్, కూతుర్లు సోహా, సభ తమ తమ పనులు, సినిమా షూటింగుల్లో భాగంగా బిజీగా ఉన్నారని, అందు వల్ల వారు కూడా హాజరు కాలేక పోతున్నారని షర్మిల చెప్పుకొచ్చింది. అనారోగ్యం కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కాకపోతున్నందుకు ఎంతో బాధగా ఉందని షర్మిల చెప్పుకొచ్చారు.

ట్రాన్సపరెంట్ డ్రస్ లలో... హీరోయిన్స్ లోపలి అందాలు (ఫోటో ఫీచర్)

బాలీవుడ్ హీరోయిన్స్ చాలా విషయాలలో ఫాస్ట్ గా ఉన్నారు. ముఖ్యంగా తమ డ్రస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో కన్నా బయిట ట్రాన్సపెంట్ డ్రస్సుల్లో వారు కనపడి ఆకట్టుకుంటున్నారు. వాటికోసం వారు ప్రత్యేక శ్రధ్ద చూపించి అభిమానులును అలరిస్తున్నారు.
సినిమాలు చేయడంలో ఇప్పుడున్న హీరోయిన్స్ ది ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కొందరు నృత్య ప్రధానమైన చిత్రాలలో నటించేవారుండగా ..మరికొందరు హస్య ప్రధానాంశంగా ఉండే చిత్రాలు చేస్తున్నారు. కరీనాకపూర్, కత్రినాకైఫ్ వంటి స్టార్ హీరోయిన్స్ ఎలాంటి చిత్రాలలోనైనా ఇట్టే సెట్టయ్యేవారు. అందుకనే వారిని అభిమానులు మర్చిపోలేకున్నారు.
నేటి క్రతినా కైఫ్‌, దీపికా పదుకొణ, మల్లికా షెరావత్‌, రాణీ ముఖర్జీ, సుస్మితా సేన్‌, విద్యాబాలన్‌, కరీనా కపూర్‌, లారాదత్తా, జెనీలియా తదితర భామలు నటనతో కాకుండా కొలతలతో ఎక్కువగా నెట్టుకొస్తున్నారనిపిస్తంది. ఆ కొలతలు అందానికి అందమిచ్చేవి కాకుండా వేడిని వేడెక్కించేవిగా ఉంటున్నాయి అని కూడా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోంచే 'ఐటమ్‌ గర్ల్‌ ' అనే మాట పుట్టింది.
నిన్నటి బాలీవుడ్‌ స్టార్‌లలో హీరోయిన్లు వేరు- స్పష్టంగా వాంప్‌ వేరు. ఇపుడు అందాలు వేటికవేగా లేకపోవడంతో ఈ కల్చర్‌ సినీరంగంలో ముందు బాలీవుడ్‌ని, ఆ తరువాత ఇతర వుడ్‌లని పట్టుకొంది. హీరో హీరోయిన్లతో బాటు 'ఐటమ్‌ సాంగ్‌'ని కూడా హీరోయిన్లతోటే గెంతిస్తున్నారు. ఇక్కడ చెరిగిపోయింది ముందు నటన తరువాత అందం. అలాంటి కొందరు హీరోయిన్స్ లో కొందరి అందాలను చూద్దాం.

సెన్సార్ బోర్డు తీరుపై ‘జబర్‌దస్త్’ దర్శకురాలు అప్‌సెట్

Nandini Reddy Upset With Jabardasth Censorship సెన్సార్ బోర్డు తీరుపై ‘జబర్‌దస్త్' చిత్ర దర్శకురాలు నందినీరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ పొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పలు డైలాగులు, సీన్లతో పాటు, అల్లా అల్లా సాంగుకు కూడా సెన్సార్ బోర్డ్ కత్తెర పెట్టింది. ‘అల్లా అల్లా' బదులు ‘హల్లా గుల్లా' అని పదాలు మార్చాలని హుకుం జారీ చేసింది.
ఈ నేపథ్యంలో నందినీరెడ్డి మాట్లాడుతూ...‘విశ్వరూపం' చిత్రం కాంట్రవర్సీ తర్వాత సెన్సార్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ‘అల్లా అల్లా' పదంలో ముస్లింలను కించ పరిచే విధంగా ఏముందో నాకు అర్థం కావడం లేదు. సెన్సార్ బోర్డ్ కఠిన నిర్ణయాల వల్ల సినిమా స్వేచ్ఛ హరించ బడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే సినిమా ప్రపంచం చీకటి యుగాలకు వెలుతుంది.' అని ఆమె అభిప్రాయ పడ్డారు.
‘అదే విధంగా సినిమాలో చాలా డైలాగులను తొలగించారు. సెన్సార్ బోర్డు తీరు మరీ దారుణంగా ఉంది. సినిమాలు ఎలా తీయాలో, ఎలాంటి పదాలు వాడకూడదో, ఎలాంటి పదాలు వాడాలో స్పష్టం వెల్లడిస్తూ సెన్సార్ బోర్డు వారు ఓ టెక్ట్స్ బుక్ రిలీజ్ చేస్తే బాగుటుంది' అంటూ నందినీరెడ్డి ఘాటుగా స్పందించారు.
సిద్ధార్థ-సమంత జంటగా నటిస్తున్న ‘జబర్‌దస్త్' మూవీని ఫిబ్రవరి 22న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో నందినీరెడ్డి దర్శకత్వం వహించని ‘అలా మొదలైంది' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

స్టార్ హీరోను ‘ఐటం బాంబ్’ అంటూ సెక్సీలేడీ కామెంట్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‍పై బి-టౌన్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్ సంచనలన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ ఐటం బాంబ్ అంటూ కామెంట్స్ చేసింది. ఇటీవల మీడియా వారు ఆమె పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చిన సందర్భంలో రాఖీ సావంత్ ఈ వ్యాఖ్యలు చేసింది.
తన పెళ్లి గురించి రాఖీ సావంత్ మాట్లాడుతూ...2014లో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తనకు సరిపోయే మిస్టర్ పర్‌ఫెక్ట్ కోసం వెతుకుతున్నట్లు రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్ ఖాన్ ప్రస్తావన తెస్తూ, ‘సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న రోజే నేను పెళ్లి చేసుకుంటాను. అయితే ఒకే వేదికపై మాత్రం కాదు. ఎందుకంటే రెండు ఐటం బాంబులు ఒకే సమయంలో పేలవు, పేలినా తట్టుకోవడం కష్టం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది రాఖీ.
వివాదాలతో సావాసం చేయడం రాఖీ సావంత్‌కు కొత్తేమీ కాదు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే రకం. ఐటం సాంగులు, శృతి మించిన ఎక్స్ ఫోజింగుతో పాపులర్ అయిన రాఖీ...తన పేరు తరచూ మీడియాలో మార్మోగేందుకు స్టార్ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేస్తుండటం గతంలో చాలా సార్లు చూశాం. రజనీకాంత్ నా డ్రీమ్ మ్యాన్. ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ స్పా సెంటర్‌ను ఓపెన్ చేసేందుకు ఆ మధ్య హైదరాబాద్ వచ్చిన రాఖీ...రామ్ చరణ్‌ పేరును తన పబ్లిసిటీ కోసం వాడేసుకుంది. ఓపెనింగ్ సందర్భంగా....మీరు సౌత్‌‌లో ఎక్కువగా లవ్ చేసే మగాడు ఎవరు? అని మీడియా వారు ప్రశ్నించగా....చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అంటూ సమాధానం ఇచ్చింది రాఖీ.
రాఖీ సావంత్ గురించిన మరిన్నివిషయాలు తెలుసుకుంటూ హాట్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం...
2003లో హిందీ మూవీ ‘చురాలియా హమ్ తుమ్నే' చిత్రం కోసం ఆడిషన్స్ జరుగగా హాజరైంది. ఈచిత్రంలో ఎంపికయి మొహాబ్బత్ హై మిర్చి అనే సాంగులో ఐటం గర్ల్ గా చేసింది.ఆ తర్వాత పలు సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు చేసింది. ఆమె నటించిన సినిమాల్లో మస్తీ, మై హూ నా లాంటి చిత్రాలు కూడా ఉన్నాయి.006లో గాయకుడు మికాసింగ్ రాఖీ సావంత్ ను బలవంతంగా ఆమె పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుట్లో ఇదో పెద్ద కాంట్రవర్సీగా మారి పోయింది. ఈ వివాదం రాఖీ సావంత్‌కు రియాల్టీ షో అవకాశాలను తెచ్చి పెట్టింది.2009లో ప్రసారమైన ‘రాఖీకా స్వయంవర్' టీవీ కార్యక్రమం తర్వాత ఏలేష్ పరుజన్‌వాలాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన రాఖీ సావంత్ ఆ తర్వాత అతనికి హ్యాండ్ ఇచ్చింది.

నన్ను ఆమె పూర్తిగా వాడుకుంది: సిద్ధార్థ (ఫోటోలు)

హీరో సిద్ధార్థ, సమంత జంటగా నటించిన ‘జబర్‌దస్త్' మూవీ రేపు(ఫిబ్రవరి 22) గ్రాండ్ గా విడుదలవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమెషన్‌లో హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు నందినీరెడ్డి, హీరో సిద్ధార్థ, వెలిగొండ శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ...‘సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మూవీ ప్రీమియర్ షో చూసిన ప్రముఖులంతా బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ సినిమాతో ఎమోషనల్‌గా అటాచ్ అవుతారు. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. సినిమాలో ఏమైనా లోపాలుంటే అది పూర్తిగా నా వల్లే. హీరో హీరోయిన్లతో పాటు అంతా చాలా బాగా నటించారు. అందరు టెక్నీషియన్స్ నాకు బాగా సపోర్టు చేసారు' అని వెల్లడించారు.
హీరో సిద్దార్థ మాట్లాడుతూ, ‘దర్శకురాలు నందినీరెడ్డి ఈ సినిమా కోసం నాలోని టాలెంట్‌ను పూర్తిగా వాడుకున్నారు. ఈ సినిమాలో ఇదివరకెప్పుడూ చూడని సిద్ధార్థను చూస్తారు. జబర్‌దస్త్ మూవీ పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సమంత ఇప్పటికే వరుసగా తెలుగులో 6 హిట్లు కొట్టింది. జబర్ దస్త్ సినిమా ఆమె ఖాతాలో చేరబోతున్న 7వ హిట్ సినిమా అని కచ్చితంగా చెప్పగలను' అన్నారు. ‘అలా మొదలైంది' ఫేం నందినీరెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నండగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్, సునీల్ ఈచిత్రంలో అతిపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈచిత్రానికి సంగీతం అందించారు.

2013లో రానున్న సం'చలన' చిత్రాలు!(ఫోటో ఫీచర్)

ఇప్పుడు బాలీవుడ్ లో నిజ జీవిత కథలను తెరకెక్కించే ట్రెండ్ మొదలయ్యింది. అప్పటికే పాపులర్ అయిన వ్యక్తుల జీవిత చరిత్రలను తెరకెక్కించటం ద్వారా రిలీజ్ కు ముందే కొందరు ఆడియన్స్ ని ప్రిపేర్ చేయవచ్చనే స్ట్రాటజీతో ఈ చిత్రాలు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఈ తరహా కథలే వినిపిస్తున్నాయి. ఒకరకంగా ఈ తరహా చిత్రాలకు డర్టీ పిక్చర్ ప్రాణం పోసిందనే చెప్పాలి.
బాలీవుడ్‌ పరిశ్రమ ఇప్పుడు సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. నిజ జీవితంలో సంచలనాలు సృష్టించిన వ్యక్తుల జీవిత చరిత్రను, వాళ్ల విలక్షణ జీవితాన్ని వెండి తెరకు పరిచయం చేయనుంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జీవిత చరిత్రను తెరపైకెక్కించగా ఫ్రాన్స్‌కు చెందిన నటి మోనికా బెల్లూచి తెరపై నటించింది.
2007లో విడుదలకు సిద్ధమైనా ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడినా ఆ పంథా కొనసాగుతూనే ఉంది. దక్షిణ భారత సినిమా ప్రపంచంలో శృంగార నృత్య తారగా ఓ వెలుగు వెలిగిన సిల్క్‌స్మిత జీవితగాధ తెరకెక్కి విద్యాబాలన్‌కు ఈ చిత్రం ఎన్నో అవార్డులు, మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన విషయం విదితమే. ఇదే తరహాలో మరికొందరు దర్శక, నిర్మాతలు, నటీనటులు నిజ జీవితగాథను తెరపై పండిచేందుకు ఎవరి పద్దతిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు.అక్షయ్‌ కుమార్‌: దావూద్‌ ఇబ్రహీం తెరపై కనిపించనున్నాడు. ఏక్తా కపూర్‌ నిర్మించనున్న 'వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబయి-2', 'డర్టీ పిక్చర్‌' దర్శకుడు మిలన్‌ లూత్రియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇండియా-పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ వివాదం, 1993లో జరిగిన ముంబయి పేలుళ్లలో దావూద్‌ ప్రధాన నిందితుడు. గతంలో 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబయి' చిత్రంలో దావూద్‌పాత్రను నటుడు సోనుసూద్‌ పోషించాడు. ప్రస్తుతం 'స్పెషల్‌ 26' చిత్రంలో నకిలీ సీబీఐ పాత్రలో అకట్టుకున్న అక్షయ్‌ కుమార్‌ ఇప్పుడు దావూద్‌ పాత్రలో ఎలా కనిపించనున్నాడో చూడాలి.ప్రియాంకా చోప్రా: బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎవరూ చెయ్యని పాత్రను ప్రియాంకా పోషించనుంది. బాక్సర్‌గా ఒలింపిక్స్‌లో మహిళా విభగంలో దేశానికి పతకం సాధించిన మణిపూర్‌కు చెందిన 29 ఏళ్ల మేరీకోం జీవితగాధను 'మేరీకోం బయోపిక్‌' పేరుతో బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సారీ తెరకెక్కించనున్నాడు. మేరీ నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. పెళ్లయిన తరువాత జరిగిన సంఘటనలు, ఒలింపిక్స్‌ ప్రయాణం ఈ చిత్రంలో చూపించనున్నాడు. ఈ చిత్రం కోసం ప్రియాంకా చోప్రా బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది.రణబీర్‌ కపూర్‌: 1970, 1980లో ఎన్నో సూపర్‌ హిట్‌ గీతాలను అలపించిన సింగర్‌ కిషోర్‌ కుమార్‌ పాత్రను రణబీర్‌ కపూర్‌ పోషించనున్నాడు. తన తండ్రి రిషీ కపూర్‌కి 'బచ్నా ఏ హసీనో' అనే గీతం అప్పట్లో ఎంతో హిట్‌ అయ్యిందని, ఆపాట పాడిన సింగర్‌ పాత్రను పోషించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇప్పుడు కూడా తాను నటించే చిత్రంలో తాను ఆ గీతాన్ని అలపించనున్నట్లు రణబీర్‌ తెలిపాడు. ఇప్పటికే సింగర్‌గా రాక్‌స్టార్‌ చిత్రంతో అలరించిన రణబీర్‌ కిషోర్‌ కుమార్‌గా ఎలా కనువిందు చేయనున్నాడో చూడాలి.విద్యా బాలన్‌: 'ది డర్టీ పిక్చర్‌', 'కహానీ' చిత్రాలలో హీరోతో సంబంధం లేకుండానే తన నటనతో భారీ విజయాలను సొంతం చేసుకున్న నటి విద్యా బాలన్‌. సింగర్‌గా వేలాది పాటలు పాడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎమ్‌.ఎస్‌.సుబ్బలక్ష్మి పాత్రలో విద్యా కనిపించనుంది. మద్రాసుకు చెందిన సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర ఇటు బాలీవుడ్‌, అటు దక్షిణాది ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని అందరూ ఎంతో అసక్తిగా ఎదురు చూస్తున్నారు.మాధురీ దీక్షిత్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహిళ హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం పోరాడతూ గులాబీ గ్యాంగ్‌ను స్థాపించిన సంపత్‌పాల్‌ జీవనశైలిని సౌమిక్‌ సేన్‌ మాధురీ దీక్షిత్‌తో తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించిన దర్శకుడిపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. తన అభిప్రాయం తెలుసుకోకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సంపత్‌పాల్‌ విమర్శలు చేసింది. ఎన్నో వివాదాలతో కూడిన ఒక వ్యక్తి జీవిత చరిత్రను దర్శకుడు ఎలా తెరకెక్కించనున్నాడో, ప్రేక్షకులను ఎలా మెప్పించనున్నాడో.మల్లికా శరావత్‌: శృంగార తారగా పేరు తెచ్చుకున్న ఈనటి ఇప్పటి వరకు ఎవరు చెయ్యని ఒక పాత్రను చెయ్యనుంది. 1992 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లో భన్వరి దేవి అనే మహిళపై అయిదుగురు దుండగులు కిరాతకంగా నడి రోడ్డుపై జరిపిన సామూహిక అత్యాచారం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. అత్యాచారానికి గురైన మహిళ పట్ల సమాజం స్పందన ఎలా ఉంటుంది.. సమాజాన్ని జయించి జీవితాన్ని తన కుటుంబ సభ్యులతో ఎలా సాగిస్తుంది అనే కథాంశంతో తెరకెక్కించే ఈ చిత్రంలో పాత్రకు మల్లికా ఎంతవరకు న్యాయం చెయ్యగలదో చూడాలి మరి. శృంగార తారగా పేరు తెచ్చుకున్నా ఈ భామ ఇందులో పూర్తిస్థాయి గృహిణిగా ఎలా మెప్పించనుందో అనే విషయం ఇప్పుడు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Google+ Followers

Popular Posts