Search

Thursday 21 February 2013

హాట్ న్యూస్ : థ్రిల్లర్ చిత్రం చేస్తున్న మహేష్ బాబు

Mahesh Babu Film Will Be Thriller మహేష్,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఎలా ఉంటుంది..ఎలా ఉండబోతోంది అనే అంచనాలు అభిమానల్లో రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మహేష్ ఇప్పటిదాకా చేయని జానర్ తో ఈ చిత్రం చేస్తున్నాడని సమాచారం. అదీ థ్రిల్లర్ జనర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. పూర్తిగా స్క్రీన్ ప్లే తో నడిచే చిత్రంగా ఉంటుందని,చాలా ప్రెష్ గా ఉంటుందని,ఖచ్చితంగా తెలుగు తెరపై ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుందని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నారు.
దానికితోడు ఈ భారీ బడ్జెట్ చిత్రం టెక్నికల్ గా చాలా అడ్వాన్సెడ్ గా ఉండనుంది. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం నలభై రోజుల పాటు లండన్ వెళ్లనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరం మధ్యలో విడుదల కానుంది. అక్కడ పలు కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. త్వరలో ఈ షూటింగ్ షెడ్యూల్ డేట్స్ ఖరారు కానున్నాయి.
ఈ చిత్రంలో క్రితి సానన్ హారోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో ‘దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే....బాలీవుడ్ మూవీ ‘ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో ‘మహేష్ బాబు-సుకుమార్' సినిమాకు పని చేయబోతున్నారు.
సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

No comments:

Post a Comment