Search

Thursday 21 February 2013

బుల్లితెర తారల పోరుబాట, అండగా నిలిచిన దాసరి

Telugu Tv Artist Concern Against On Dubbing Serials డబ్బింగ్ సీరియల్స్‌ను నిషేదించాలంటూ ‘తెలుగు టీవీ కళాకారుల పరిరక్షణ సమితి' ఈ రోజు సీరియళ్ల షూటింగుకు బంద్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతా హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. డబ్బింగ్ సీరియళ్ల వల్ల తెలుగు టీవీ కళాకారులు ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని, వాటిని నిషేదించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
తెలగు టీవీ కళాకారులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ మాదిరి, తెలుగు టీవీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని, డబ్బింగ్ సీరియళ్లను నిషేదించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో మాతృభాషపై ఇక్కడి వారికి అభిమానం లేదని, పక్క రాష్ట్రాల వారు భాషాభిమానం చూపిస్తుంటే.... మన వద్ద కనీస బాధ్యత ఎవరూ వహించడం లేదని దాసరి ఆవేదన వ్యక్తం చేసారు. తెలుగు భాషను, తెలుగు కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
ఈ ఆందోళన ఇలా ఉంటే... డబ్బింగ్ సీరియల్స్ నిషేదిస్తే తమకు ఉపాది కరువవుతుందని, తామంతా రోడ్డున పడతామని డబ్బింగ్ ఆర్టిస్టులు ఆందోళన చేపట్టారు. డబ్బింగ్ సీరియల్స్‌ను నిషేదిస్తే తామంతా ఆందోళనకు దిగుతామని డబ్బింగ్ కళాకారులు అంటున్నారు.

No comments:

Post a Comment