Search

Thursday 21 February 2013

హరీష్ శంకర్ కొత్త చిత్రం టైటిల్ "పండుగ చేసుకో"

Harish Shankar New Title Called Panadaga Chesukoo గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్ తాజాగా "పండుగ చేసుకో" అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. రెగ్యులర్ గా తెలుగువారు వాడే ఈ పదం చాలా ఆసక్తి రేపుతోంది. ఇంతకీ హరీష్ శంకర్ ఏ హీరోతో చేయబోయే చిత్రానికి ఈ టైటిల్ పెట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఓ పెద్ద హీరో కోసమే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారని చెప్తున్నారు.
ఇక జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్,సమంత కాంబినేషన్ లో వచ్చిన బృందావనం హిట్ కావటంతో ఈ కాంబినేషన్ పై మరింత అంచనాలు పెరుగుతాయి. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్. గబ్బర్ సింగ్ తో తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకున్న హరీష్ ఈ చిత్రంతో తెలుగులో తిరుగులేని దర్శకుడుగా ఎదుగుతాడంటున్నారు.

మరో ప్రక్క గతంలో ఎన్టీఆర్ తో బృందావనం వంటి హిట్ చిత్రం తీసిన దిల్ రాజు ఈచిత్రానికి నిర్మాత కావడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

No comments:

Post a Comment