Search

Sunday 27 January 2013

కింగ్‌ నాగార్జున 'గ్రీకువీరుడు' ఫస్ట్‌ లుక్‌ విడుదల

nagarjuna greekuveerudu
WD
WD
కింగ్‌ నాగార్జున హీరోగా కామాక్షి మూవీస్‌ పతాకంపై 'అల్లరి అల్లుడు', 'సీతారామరాజు', 'నేనున్నాను', 'కింగ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత డి.శివప్రసాద్‌ రెడ్డి కింగ్‌ నాగార్జున హీరోగా నిర్మిస్తున్న 'గ్రీకువీరుడు' ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత డి.శివప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ.. ''ఈరోజు ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశాం. ఫిబ్రవరి 15 కల్లా టోటల్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. 9 వరకు టాకీపార్ట్‌ జరుగుతుంది. 10 నుంచి ఫారిన్‌లో ఒక పాట చిత్రీకరణ జరుగుతుంది. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది. మార్చిలో ఆడియో రిలీజ్‌ చేసి, అదే నెలలో సినిమాని కూడా విడుదల చేస్తామన్నారు.

నాగార్జునగారికి మా బేనర్‌లో మరో సూపర్‌ హిట్‌ సినిమా అవుతుంది. 'గ్రీకువీరుడు' టైటిల్‌కి ప్రేక్షకుల నుంచి, నాగార్జునగారి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చిందన్నారు. నాగార్జునగారితో 'సంతోషం' వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన దశరథ్‌ 'గ్రీకువీరుడు' చిత్రాన్ని మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు, నాగార్జునగారి అభిమానులకు నచ్చే అన్ని అంశాలు 'గ్రీకువీరుడు'లో ఉంటాయి'' అన్నారు.

కింగ్‌ నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా చోప్రా, కె.విశ్వనాథ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, ఎం.ఎస్‌.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, వేణుమాధవ్‌, రఘుబాబు, కాశీ విశ్వనాథ్‌, వెన్నెల కిషోర్‌, నాగినీడు, సుప్రీత్‌, అశోక్‌కుమార్‌, భరత్‌ రెడ్డి, సంజయ్‌ స్వరూప్‌, తాగుబోతు రమేష్‌, సారిక రామచంద్రరావు, గీతాంజలి, సుధ, జయలక్ష్మీ, జయవాణి, లహరి, ఇందూ ఆనంద్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: అనిల్‌ భండారి, ఆర్ట్‌: రవీందర్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఫైట్స్‌: విజయ్‌, సాల్మన్‌రాజు, స్టిల్స్‌: జూపల్లి రఘు, కో-డైలాగ్స్‌: ప్రవీణ్‌వర్మ, స్క్రీన్‌ప్లే: హరి, ఎం.శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వివేకానంద కూచిభొట్ల, కో-ప్రొడ్యూసర్‌: డి.విశ్వచందన్‌రెడ్డి, నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి, కథ-మాటలు-దర్శకత్వం కె.దశరథ్‌.

No comments:

Post a Comment

Popular Posts