Search

Sunday, 27 January 2013

కమల్‌ 'విశ్వరూపం' చూపించాడు... రివ్యూ రిపోర్ట్...!!

నటీనటులు: కమల్‌ హాసన్‌, పూజ కుమార్‌, ఆండ్రియా జరిమియా, నాజర్‌, రాహుల్‌ బోస్‌, శేఖర్‌ కపూర్‌ తదితరులు; మాటలు: వెన్నెలకంటి, కెమెరా: సాను జాన్‌ వర్గాస్‌, నిర్మాతలు: ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌, రచన, దర్శకత్వం: కమల్‌ హాసన్‌.

కమల్‌ హాసన్ విశ్వరూపం అనగానే ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న చిత్రం ఎలా ఉంటుందా? అనే ఆససక్తి నెలకొంది. విడుదలకు ముందు డీటీహెచ్‌ వివాదం వచ్చిపడింది. ఆ తర్వాత ముస్లిం సోదరుల మనోభావాలను కించపరిచేదిగి ఉందంటూ తమిళనాడులో జయ సర్కార్ దీనిపై నిషేధం విధించారు. దీంతో తమిళనాడులో విడుదల కాలేదు. మాతృ భాషలో విడుదల కాకపోయినా అనువాదం తెలుగులో విడుదలై కాస్త ఆశ్చర్యాన్ని కల్గించింది. పైగా ఆంధ్రలో ముస్లిం ప్రాంతాల్లో విడుదల కాలేదు. అక్కడ గొడవలు జరక్కుండా కమీషనర్‌ చర్యలు తీసుకున్నారు. అసలు ఇంత గొడవలకు కారణం ఏమిటి? అనేది పరిశీలిస్తే.. కథలోకి వెళ్ళాల్సిందే.

కథ : విశ్వనాథ్‌ (కమల్‌) కథక్‌ డాన్సర్‌. అతని భార్య అనుపమ (పూజాకుమారి) అణుశాస్త్రవేత్త. తన ఉన్నతి గురించి విదేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వీరిద్దరు ఓ ఒప్పందంపై వెళతాడు. అక్కడ ఆమె తన బాస్‌తో ఎఫైర్‌ పెట్టుకుంటుంది. భర్తను వదిలించుకోవాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు అక్కడ ఓ భయంకరమైన నిజం ఆమెకు తెలుస్తుంది. అది ఏమిటి? తర్వాత పరిణామాలు ఏమిటి? అనేది సినిమా.

ముఖ్యంగా ఇస్లామిక్‌ టెర్రరిజంపై చిలా చిత్రాలు వచ్చాయి. అయితే ఇందులో కమల్‌ పాత్ర ముస్లిమే. ఏ పాత్ర పోషించినా అందులో జీవిస్తాడు. ఇందులోనూ కథక్‌ డాన్సర్‌గా ఒదిగిపోయాడు. అతని అభినయం అలరిస్తుంది. కమల్‌కు వయస్సు పైబడిందనేది యాక్షన్‌ సన్నివేశాల్లో చూస్తే అనిపించదు. చాలా ఏక్టివ్‌గా చేశాడు. ఇక పూజాకుమారి పాత్ర కొన్నిచోట్ల ఎక్కువగా నటించింది అనిపిస్తుంది. నాజర్‌, శేఖర్‌ కపూర్‌లు పాత్రలు బాగున్నాయి.

టెక్నికల్‌:
సాంకేతికంగా ప్రధానంగా చెప్పాల్సింది కెమెరాపనితనం. బాంబులు, హెలికాప్టర్లపై యాక్షన్‌ సన్నివేశాల్లో అద్భుతంగా తీశాడు. ఒకరకంగా చెప్పాలంటే హాలీవుడ్‌ చిత్రాన్ని తలపిస్తుంది. దక్షిణాదిలో ఇటువంటి తరహా చిత్రం తీసినందుకు కమల్‌ను అభినందించాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్‌లో సన్నివేశాలు ఎండలో కూడా కష్టపడి చేశామని కమల్‌ చెప్పినమాట నిజమనిస్తుంది. ఫస్టాఫ్‌లో కాస్త స్లోగా నడిచినా... సెకండాఫ్‌లో కథ రక్తికడుతుంది. కొన్ని సన్నివేశాలు ఉత్కంఠను కల్గిస్తాయి. ఆఫ్ఘన్‌ దాడులు ఈ చిత్రంలో చూడవచ్చు. నిర్మాణపు విలువుల అద్భుతంగా ఉన్నాయి. నిజంగా విశ్వరూపం చూపించాడు. నటుడు, దర్శకుడిగా ఇద్దరూ ఆయన్ను డామినేట్‌ చేశారు. సెకండాఫ్‌లో దర్శకుడు హైలైట్ అయ్యాడు. చాలా సమర్థవంతంగా తీశాడు.

ముఖ్యాంశాలు
1. కెమెరా పనితనం
2. నిర్మాణపు విలువలు
3. యాక్షన్‌ సన్నివేశాలు

మైనస్‌లుగా చెప్పాలంటే... ప్రథమార్థంలో స్లోగా చెప్పే తీరు బోరుకొట్టిస్తుంది.

ఇక సినిమా మొత్తంగా ఇండియాలో తీసిన చాలా అద్భుతమైన టెక్నికల్‌ వాల్యూస్‌ ఉన్న చిత్రంగా చెప్పవచ్చు. చాలాచోట్ల సహజత్వమైన సన్నివేశాలు కన్పిస్తాయి. టెర్రరిస్టులు తీరును గమనించి వారు బిహేవియర్‌ ఎలా ఉంటుందో చక్కగా చూపించాడు. అంతరిక్షంలో సాగే ఎపిసోడ్‌ చాలా ఇంటిలిజెంట్‌గా ఉంటుంది. ఇలాంటివి గతంలో జేమ్స్‌బాండ్‌ చిత్రాల్లో చూసేవాళ్ళం. కమల్‌ కామెడీగా పండించాడు.

ఇక కమర్షియల్‌గా ఎంతటి పేరు తెచ్చుకుంటుందోగానీ చక్కటి చిత్రం తీశాడని ప్రేక్షకుడు భావిస్తాడు. మేకింగ్‌ తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. కమల్‌ నుంచి ఏమి ఆశిస్తారో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిచోట్ల విడుదలైంది. హైదరాబాద్‌లో ఓల్డ్‌సిటీతో పాటు పలుచోట్ల విడుదల కాలేదు. ఇంత గొడవ జరిగినా మంచి చిత్రం తీశాడనే ప్రేక్షకుడు భావించడం చిత్రానికి ప్లస్‌ అవుతుంది.

Google+ Followers

Popular Posts