Search

Tuesday, 19 February 2013

అంబానీల పార్టీకి...చిరు, పవన్, నాగ్, చరణ్, వెంకీ, సమంత!

Anil Ambani Invitation T Town Stars దేశంలోని టాప్ ధనవంతుల్లో ఒకరైన అనిల్ అంబానీ ‘రిలయన్స్ బిగ్ ఎంటర్ టైన్మెంట్స్'అనే సంస్థ స్థాపించి సినిమా రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రిలయన్స్ సంస్థ టాలీవుడ్లో దాదాపు 80 కోట్ల వరకు పెట్టుబడి వ్యాపారం చేసింది. ఈ క్రమంలో తెలుగు సినీ ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకుంటోంది అనిల్ అంబానీ ఫ్యామిలీ.
తాజాగా అనిల్ అంబానీ ముంబైలోని పాలిహిల్ ఏరియాలో దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి 150 మీటర్ల పొడవైన భారీ నివాస భవంతిని నిర్మించుకున్నాడు. సకల సౌకర్యాలతో కూడిన ఈ విలాసవంతమైన భవనంలో లేని సౌకర్యం అంటూ లేదు. తన అన్నయ్య ముఖేష్ అంబానీ ఇంటికీ ధీటుగా అనిల్ దీన్ని నిర్మించుకున్నాడు.
మార్చి 12న ఈ ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్న అనిల్ అంబానీ బాలీవుడ్ తో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆహ్వానం పంపారు. అందరికీ ఈ ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, హీరోయిన్లు అనుష్క, సమంత, కాజల్, ఇలియానా, దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ తదితరులకు ఆహ్వానాలు అందాయి.
రియలన్స్ ఎంట్ టైన్మెంట్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాను బివిఎస్‌ఎన్ ప్రసాద్‌తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న ‘జంజీర్' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Google+ Followers