Search

Tuesday, 19 February 2013

Photos:సెక్సీ తమన్నా గాంగ్నమ్ స్టైల్ డాన్స్

తన సెక్సీ అందాలు, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్‌తో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ తమన్నా...ప్రస్తుతం బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌తో ‘హిమ్మత్ వాలా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో తమన్నా ‘గాంగ్నమ్ స్టైల్' డాన్స్ చేయబోతోందట. ఈ చిత్రంలోని ‘బుం పె హాత్' అనే పాటలో తమన్నా ‘గాంగ్నమ్ స్టైల్' స్టెప్పులు వేయనుందని సమాచారం.
ఈచిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి హిమ్మత్ వాలా సినిమాకు మూలం టాలీవుడ్లోనే ఉంది. తెలుగులో కృష్ణ,జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊరికి మొనగాడు' చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది.
అదే సినిమాను పద్మాలయా సంస్థ హిందీలో 'హిమ్మత్ వాలా' పేరుతో 1983లో తెరకెక్కించింది. ఇందులో జితేంద్ర, శ్రీదేవి నాయకానాయికలుగా నటించారు. ఈ సినిమాకు కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ లో శ్రీదేవి అందాల తారగా మార్కులు సంపాదించారు. ఇప్పుడు అదే చిత్రం రీమేక్‌లో తమన్నా నటిస్తోంది. ‘చాంద్ సా రోషన్ చెహ్రా' అనే బాలీవుడ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన తమన్నాకు అక్కడ కలిసి రాక సౌత్ బాట పట్టి సక్సెస్ అయింది. మరి హిమ్మత్ వాలా రీమేక్ ద్వారా తమన్నా బాలీవుడ్లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Google+ Followers