Search

Tuesday, 19 February 2013

ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఆడియో వినూత్నంగా..?

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బాద్ షా' చిత్రం ఆడియోను వినూత్న రీతిలో విడుదల చేసేదుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇంటిపై ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక సాదాసీదాగా నిర్వహిస్తే ఆ ఎఫెక్టు వల్లనే ఇలా చేసారనే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో, బాద్ షా ఆడియో వేడుక వినూత్న పద్దతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఆడియో వేడుకకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. మార్చి 10వ తేదీన ఆడియో వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘బాద్ షా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్‌పై స్పెయిన్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ‘బాద్ షా' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.
baadshah might have an innovative audio launch
దర్శకుడు శ్రీను వైట్ల ‘బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

No comments:

Post a Comment

Popular Posts