Search

Wednesday, 20 February 2013

మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసిన రామ్ చరణ్!

Charan Signs Another Bollywood Film మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్లో ఈచిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన జంజీర్ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, టాలెంట్‌పై పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ....పలు బాలీవుడ్ సినిమాల అవకాశాలు వస్తున్నాయని, పలవురు దర్శక నిర్మాతలు తనకోసం తెచ్చిన స్క్రిప్టులు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు కూడా. తాజాగా బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ రెండో బాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
జంజీర్ సినిమా విషయానికొస్తే...జంజీర్' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ మొదటి ఏప్రిల్ లో అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మే 10కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది.

Google+ Followers

Popular Posts