Search

Friday 15 February 2013

మగాళ్లు సెక్స్ కోసమే' అన్న హీరోయిన్ కేసుపై హైకోర్టు స్టే

Sona Gets High Court Stay నటి సోనా కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. పురుషులకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని ఎగ్మూరు మేజిస్ట్రేట్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. దీనికి సంబంధించి కోర్టుకు హాజరు కావాలని ఆమెకు ఆదేశాలు జారీ అయ్యాయి. నేరుగా హాజరుకు మినహాయింపు ఇవ్వాలని సోనా మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. న్యాయమూర్తి కృపాకరన్‌ బుధవారం దీన్ని విచారించారు. సోనా తరఫు న్యాయవాది తంగశివన్‌ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి సానుకూల ఆదేశాలు జారీ చేశారు.
పురుషులను కించపరిచే విధంగా మాట్లాడిన సినీనటి సోనాపై ఎగ్మూర్ కోర్టులో నమోదైన కేసుపై స్టే విధిస్తూ బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పురుషుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నటి సోనా మాట్లాడిందని, ఆమెపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో పురుషుల భద్రతా సంఘం కేసు నమోదు చేసింది. దీనిపై నేరుగా హాజరు కావాలని సోనాకు కోర్టు సమన్లు పంపింది.
నేరుగా హాజరు కావడంపై మినహాయింపు ఇవ్వాలని, కేసు రద్దు చేయాలని మద్రాసు హైకోర్టులో సోనా పిటిషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తి బుధవారం విచారించారు. నటి సోనా ఎగ్మూర్ కోర్టులో హాజరు కావడంపై మినహాయింపు ఇచ్చారు. సోనాపై ఎగ్మూర్ కోర్టులో నమోదైన కేసు విచారణపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సోనా రీసెంట్ గా ఓ వీక్లీ మ్యాగజైన్ తో మాట్లాడుతూ...మగాళ్ళు టిష్యూ పేపర్స్ వంటివారు. వారిని సెక్స్ కోసం వాడుకుని పారేయాలి. వివాహం అనేది ఫూలిష్ నెస్. చాలా మంది పూలిష్ అమ్మాయిలు వివాహం పేరుతో కలిసి ఉంటున్నారు అంటూ రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసింది. సోనా తీరును హిందూ మక్కల్‌ కట్చి సైతం తప్పుబట్టింది. ఆమె పురుషులను చెత్తకాగితంతో పోల్చి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించింది. సంస్కృతి సంప్రదాయాల్ని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్న సోనాను అరెస్టు చేయాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి కుమార్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సంఘాలు సైతం ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment