Search

Friday, 15 February 2013

సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా

ప్రఖ్యాత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు శంకర్‌, ప్రఖ్యాత దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి......ఓ తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. 'సీమటపాకారు' ఫేమ్‌ పూర్ణ కథానాయిక. 'తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ' టైటిల్ తో రూపొందుతున్న ఈచిత్రం ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ప్రేమకు వ్యతిరేకం అనే విధంగా రూపొందుతున్న ఈచిత్రం ప్రేమికుల రోజు రోజున ప్రారంభోత్సవం జరుపుకోవడం విశేషం.
ఈ చిత్రానికి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. 'దండుపాళ్య' నిర్మాత నారాయణ్‌బాబు నిర్మాత. యాపిల్‌ బ్లోస్సమ్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి గాయని వసుందరాదాస్‌ క్లాప్‌ ఇవ్వగా, సీతారామశాస్త్రి స్విచ్చాన్‌ చేశారు. పి.వాసు గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం సీతారామశాస్త్రి మాట్లాడుతూ, టైటిల్‌లోనే గమ్మత్తు ఉంది. కన్నడ నిర్మాతలు తెలుగులోకి వస్తున్నారు. కన్నడ, తమిళంలో దర్శకునిగా పనిచేసిన రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్‌ సమకాలీకుడు పీతాంబరం తనయుడుపి.వాసు. ఆయన తనయుడు, నా బిడ్డ హీరోలుగా నటిస్తున్నారు. పిల్లల కెరీర్‌ విషయంలో స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తున్నాం' అన్నారు.
పి.వాసు మాట్లాడుతూ, తెలుగు సినిమాలకు కథలిచ్చాను. దర్శకత్వం వహించా. పరిశ్రమ హైదరాబాద్‌ తరలిరావడం తమిళపరిశ్రమకు నష్టం. తెలుగువారి అభిరుచి, కళానిపుణత గొప్పది. అదంతా చిన్నప్పుడే నాన్న పీతాంబరంతోపాటు ప్రత్యక్షంగా చూశాను. అందుకే తెలుగంటే చాలా ఇష్టం' అన్నారు. ఎవరూ ప్రయత్నించని, కొత్తకోణంలో ప్రేమకథను తెరకెక్కిస్తున్నానని దర్శకుడు తెలిపారు. తెలుగులో తమకిది తొలిచిత్రమని నిర్మాతలు తెలిపారు. అలీ, బ్రహ్మానందం, నిషా కొఠారి, నాగబాబు, సీత, షిండే, సితార తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: పికెహెచ్‌. దాస్‌, సంగీతం: మణిశర్మ, మాటలు: రాఘవ, రాఘవ టి, కథ, కథనం, దర్శకత్వం: రాఘవ.

No comments:

Post a Comment

Popular Posts