Search

Friday 15 February 2013

నమ్మకమైన కుక్క, చెడ్డ పిల్లాడు=కసబ్ : వర్మ

Kasab Is Combination An Evil Kid Loyal Dog వాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముంబైపై దాడి సంఘటనపై సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘26/11 ఇండియాపై దాడి' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ముంబై దాడుల సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపెట్టనున్నారు.
అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడదల కానుంది. దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ కసబ్ పాత్ర గురించి మాట్లాడుతూ...చెడు మనస్తత్వం గల పిల్లాడు, నమ్మకమైన కుక్క కలగలిపితే కసబ్. అతని గురించి నాకు పూర్తిగా తెలియక పోయినా పోలీసులు చెప్పిన వివరాలు, సిసి టీవీ పుటేజిల్లో అతని ప్రవర్తన, ఇతరత్రా అంశాలను బేస్ చేసుకుని కసబ్ పాత్రను రూపొందించినట్లు వర్మ వెల్లడించారు.
''మనలో చాలా మందికి ముంబై దాడుల గురించి తెలుసు. కానీ వాటి వెనక ఉన్న కొన్ని సంఘటనలు, వ్యక్తుల భావోద్వేగాలు చాలా మందికి తెలియవు. వాటిని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. ఆ దాడుల్ని ప్రత్యక్షంగా చూసిన పలువురు పోలీసులు, బాధితులతో మాట్లాడా. ప్రత్యేకంగా ఒక మతంపైనో, ఒక సముదాయంపైనో జరిగిన దాడులు కావవి. మానవత్వంపైన జరిగిన దాడులుగా అర్థమైంది. ఈ ఒక్క చిత్రంతో ఆ విషాదాన్ని, అక్కడ కొందరు చేసిన సాహసాల్ని నేను పూర్తిగా చూపించలేకపోవచ్చు. భవిష్యత్తులో ఈ సంఘటనపై మరెవరైనా సినిమా తీసినా ఆ దాడుల్లో కొద్దిమేరకే చూపించగలుగుతాం'' అని వర్మ అన్నారు.

No comments:

Post a Comment

Popular Posts