Search

Friday, 15 February 2013

ఇలియానా కి పంచ్ ఇచ్చిన కాజల్

Kajal Sweet Punch Ileana కాజల్ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ...సినిమా పూర్తవగానే అక్కడికి అయిపోయిందని చేతులు కడిగేసుకోవటం నా వల్ల కాదు. ఆ సినిమా ప్రమోషన్ కూడా నా భాధ్యతగానే భావిస్తాను అంది. ఈ స్టేట్ మెంట్ విన్న వారంతా కాజల్ కావాలనే ఇలియానాని ఉద్దేశించి అన్నదని,అలాగే పనిలో పనిగా తనను తాను చక్కగా ప్రమోట్ చేసుకుంటోందని అంటోంది.
బాలీవుడ్ మోజులో పడి అవకాసాలు దూరం చేసుకుంటున్న ఇలియానాపై ఆ మధ్య తెలుగు పరిశ్రమ మండిపడింది. ఆమె సినిమా ప్రమోషన్స్ లో పాలుపంచుకోవటంలేదని సీరియస్ అయ్యింది. దాంతో ఆమెకు పెద్ద బ్యానర్స్ వారు దూరం పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో చేసిన శక్తి చిత్రం సమయంలో ప్లాపైన సినిమాకు ప్రమోషన్ చేసినా ఫలితం ఉండదు అని మాట్లాడి అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత దేముడు చేసిన మనుష్యులు, జులాయి చిత్రాలలో చేసినా..ఆ ప్రమోషన్ లో పాల్గొనలేదు. దాంతో తెలుగు పరిశ్రమలో ఆమెపై వ్యతిరేక భావన పెరిగింది.
ఈ వ్యతిరేక భావనను కాజల్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నట్లు కనపడుతోంది. తాను బాలీవుడ్ కి వెళ్ళినా ఇక్కడ సినిమాలపైనే దృష్టి ఉంటుందని,ప్రమోషన్ ఏక్టివిటీస్ లో పాల్గొంటానని చెప్పింది. అయితే బాలీవుడ్ లో సినిమా కమిటయ్యేటప్పుడే ప్రమోషన్ ఏక్టివిటీస్ గురించి ఎగ్రిమెంట్ ఉంటుంది. దాంతో ఇష్టమున్నా లేకపోయినా ప్రమోషన్ లో పాల్గొనాల్సిందే. అందునిమిత్తం రెమ్యునేషన్ తో పాటే మాట్లాడుకుంటారు. రీసెంట్ గా కాజల్ చేసిన స్పెషల్ ఛబ్బీస్ చిత్రం బాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఆమె ఉత్సాహానికి అంతేలేకుండా పోయింది.

No comments:

Post a Comment

Popular Posts