Search

Friday 15 February 2013

వివి వినాయిక్ కొత్త చిత్రం ఈ రోజే ప్రారంభం

Vv Vinayak New Film Launching Today ప్రముఖ నిర్మాత, శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ అధినేత బెల్లంకొండ సురేశ్ పెద్ద కుమారుడు శ్రీనివాస్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో ఒకరైన వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. బెల్లంకొండ సురేశ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్స్ ల్లో ఒకరైన సమంత నటిస్తుండటం విశేషం.

కొంత కాలం క్రితం రెండు నెలల పాటు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సురేశ్ అండగా నిలిచి ఆదుకున్నారనీ, ఆ కృతజ్ఞతతో శ్రీనివాస్ సరసన చేస్తున్నాననీ ఇప్పటికే సమంత తెలిపింది. కొంతకాలంగా శ్రీనివాస్ నటన, డాన్స్, ఫైట్స్ వంటి విభాగాల్లో చక్కని శిక్షణ తీసుకుంటూ వచ్చాడు. అతను హీరోగా నటించే సినిమా శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభం కాబోతోంది. శ్రీనివాస్‌ని ఆశీర్వదించడానికి చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.
ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. నాయక్ చిత్రం తర్వాత వినాయిక్ చేస్తున్న చిత్రం ఇదే. వినాయిక్ మొదటి చిత్రం ఆది కి నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యానర్ మీదే చేయటంతో ఆ అనుబంధం ఇలా కొనసాగుతోంది.
అలాగే సమంత ఇప్పటికే బెల్లంకొండ సురేష్ నిర్మాతగా రూపొందుతున్న నందిని రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఎన్టీఆ్రర్ తో చేయనున్న చిత్రంలోనూ ఆమెనే ఎంపిక చేసారు. ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ బెల్లంకొండ సురేష్ ..చిత్రం ప్రకటన చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ విషయం ఖరారు చేసారు. అలాగే ఎన్టీఆర్ సరసన సమంత నటించనుందంటూ తెలియపరిచారు. దాంతో బెల్లంకొండ సురేష్ మరోసారి సమంతకు తన సరసన అవకాసమిచ్చినట్లు అయింది.

No comments:

Post a Comment

Popular Posts