
చిరంజీవి 150వ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని ప్రముఖ దర్శకుడు
వి.వి.వినాయక్ అన్నారు. సత్యదేవుని దర్శనానికి ఆయన శనివారం రాత్రి అన్నవరం
వచ్చారు. స్వామి దర్శనం అనంతం మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి కోసం ఠాగూరు
కన్నా పవర్‌ఫుల్ కథ కోసం అన్వేషిస్తున్నామన్నారు. పవన్‌కల్యాణ్‌తో కొత్త
చిత్రం తీయబోతున్నానన్నారు.
రామ్ చరణ్ తో తేసిన నాయక్ చిత్రం ఘనవిజయం సాధించడంతో విజయోత్సాహంలో
ఉన్నామన్నారు. రాజమండ్రి, విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో నాయక్‌టీంతో
విజయోత్సవ యాత్ర చేపడుతున్నామన్నారు. ఫిబ్రవరిలో కొత్తచిత్రం
తీస్తున్నామన్నారు. ఈయన వెంట గంటా విష్ణు, హరిబాబు తదితరులు ఉన్నారు. ఇక
ఇదే విషయాన్ని రచయిత ఆకుల శివ కూడా ఖరారు చేసారు.
ఆకల శివ మాట్లాడుతూ...చిరంజీవి 150వ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పారు.
ఆయన మాటల్లోనే... ‘‘ఈ సినిమాకి కథ తయారు చేసే పనిలో ఉన్నాను. నేటి
సమాజంలోని అవినీతిపై పోరాడే యోధునిగా అందులో చిరంజీవిగారి పాత్ర ఉంటుంది.
వినాయక్ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఆ
సినిమా కథకు సంబంధించిన వర్క్ జరుగుతోంది. త్వరలోనే చిరంజీవిగారికి
వినిపిస్తాం'' అని తెలిపారు. అలాగే ‘‘వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ
సురేష్‌గారి అబ్బాయ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు రచన చేస్తున్నాను.
ఇంకా మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయ్'' అని తెలిపారు.
మరో ప్రక్క చిరంజీవి మాట్లాడుతూ ‘నా 150వ సినిమా గురించి నా అభిమానులు ఎంతో
ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను కూడా అంతే ఆత్రుతగా ఎదురు
చూస్తున్నాను. ఈ సినిమా ఎంతో ప్రత్యేకం, అందుకే మంచి స్క్రిప్టు కోసం ఎదురు
చూస్తున్నాను. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండ చేస్తాను' అని వెల్లడించారు.
No comments:
Post a Comment