
సంక్రాంతి సినిమాల విజయంతో మంచి ఊపు మీద ఉన్న నిర్మాత దిల్ రాజు. ఆయన
తాజాగా శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ బేనర్‌లో ‘లవర్' పేరుతో ఓ ప్రేమకథా
చిత్రాన్ని నిర్మిస్తున్నానని ప్రకటన ఇచ్చారు. హీరో పేరు కూడా తెలపకుండా ఒక
యంగ్ హీరో కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం
వహిస్తారని ప్రెస్ నోట్ విడుదల చేసారు. అయితే ఈ ప్రకటన వెనక ఓ టైటిల్
వివాదం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా...నారా రోహిత్ హీరోగా కార్తికేయ
దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం మొదలైంది. శ్రీ శైలేంద్ర మూవిస్
బ్యానర్ పై ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి లవర్ అనే టైటిల్
ని ఖరారు చేసారు. అయితే ఇప్పుడు దిల్ రాజు..తాను లవర్ టైటిల్ తో చిత్రం
చేస్తున్నానని ప్రకటించటంతో నారా రోహిత్ సినిమాకు మరో టైటిల్
వెతుక్కోవాల్సిన పని ఎదురైందని అంటున్నారు. అందుకోసమే హడావిడిగా టైటిల్ తో
చిత్ర ప్రకటన చేసారంటున్నారు. ఇంతకీ ఎవరు పేరున ఆ టైటిల్ రిజిస్టర్
అయ్యిందని అనే తెలియాలని,దిల్ రాజు బ్యానర్ పేరున ఆ టైటిల్ రిజిస్టర్
అయ్యింటే ..చేసేదేమి లేదని సినీ పెద్దలు అంటున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు తెలియజేస్తూ ‘వాసువర్మ చెప్పిన ఒక
అద్భుతమైన కథతో ఈ ‘లవర్ ' చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఆల్ రెడీ సబ్జెక్ట్
కూడా పక్కాగా రెడీ అయిపోయింది. అతి త్వరలోనే ఈచిత్రం షూటింగ్
ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలలో ఒక యంగ్ హీరో కథానాయకుడిగా నటించబోతని
చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, నిర్మాత: దిల్
రాజు, కథ,స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వాసువర్మ.
దిల్ రాజుకు సంబంధించిన ఇతర ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే.... ఆయన
నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం
సంక్రాంతి సందర్భంగా రిలీజై మంచి విజయం సాధించింది. మహేష్ బాబు, వెంకటేష్
మల్టీ స్టారర్ గా రూపొందిన ఈ చిత్రం దిల్ రాజు వాకిట్లో డబ్బుల కట్టలు
కురిపిస్తోంది. మరో వైపు దిల్ రాజు రామ్ చరణ్ హీరోగా ‘ఎవడు' చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్
చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ నటిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్
టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలయ్యే అవకాశం ఉంది.
No comments:
Post a Comment