Search

Sunday, 20 January 2013

'బాహుబలి' కోసం ప్రభాస్ జిమ్ లో ...

ప్రభాస్‌ హీరోగా రాజమౌళి తీస్తున్న చిత్రానికి 'బాహుబలి'గా వర్కింగ్‌ టైటిల్‌ను నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాత్ర డిమాండ్ మేరకు గెడ్డం పెంచుతోన్న ప్రభాస్‌, ఈ చిత్రంలో కొత్తలుక్‌తో కనిపించటానికి ఓ రేంజిలో కసరత్తలు చేస్తున్నాడు. ముఖ్యంగా రోజులో ఎక్కువ సేపు జిమ్ లో గడుపుతున్నాడు. ఈ పీరియడ్ చిత్రానికి అవసరమైన బలిష్టమైన విగ్రహం కోసం ప్రభాస్‌ ఇలా ప్రిపేర్ అవుతున్నాడు. ఆర్కా మీడియా వారు దాదాపు వందకోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను హైదరాబాద్‌కు తరలించనున్నారని కూడా సమాచారం.

prabhas gym every day six pack body
మరో ప్రక్క కథ రీత్యా ఈ సినిమాలో హిరో పాత్రకు ధీటైన పాత్ర విలన్ పాత్ర. ఆ పాత్రను ఓ స్టార్‌హీరోతోనే చేయించాలని రాజమౌళి భావించారు. ‘కృష్ణంవందే జగద్గురుమ్'తో తన ప్రతిభను నిరూపించుకున్న దగ్గుబాటి రానాను ఈ పాత్ర కోసం రాజమౌళి సంప్రదించి ఓకే చేసారు. రానా కూడా ఈ పాత్ర చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని ఆయన అంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఇందులో అన్నదమ్ములుగా, బద్దశత్రువులుగా కనిపించబోతున్నారని వినికిడి. రాజకీయ మంత్రాంగాలు, ఊహకందని పరిణామాలు ఈ కథలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని సమాచారం. అనుష్క పాత్ర ఈ కథలో కేంద్ర బిందువుగా నిలుస్తుందని చెప్తున్నారు. దాదాపు వంద కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను హైదరాబాద్‌కు తరలించనున్నారని కూడా సమాచారం.

Google+ Followers

Popular Posts