
మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలై
చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. చిత్రంలో అగ్నిప్రమాద
సన్నివేశం భక్తుల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఉందని కమలాపురం ఎమెల్యే
జి.వీరశివారెడ్డి ఆరోపించారు. ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
అప్పటివరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు.
శ్రీరామనవమి రోజున భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణవేదికలో
భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతం వల్ల
అగ్ని ప్రమాదం సంభవించడం, దాంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీయడం తదితర
దృశ్యాలపై అభ్యంతరం తెలిపారు.
శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణాన్ని లోక కళ్యాణంగా భక్తులు భావిస్తారని, ఈ
కళ్యాణానికి ముక్కోటి దేవతలు విచ్చేసి సీతారామ చంద్రులపై పూల వర్షాన్ని
కురిపిస్తారని, అష్ట దిక్పాలకులు స్వామి వారి కళ్యాణ ఏర్పాట్లకు రక్షణగా
నిలుస్తారని, పంచ భూతాలు సహితం సహకరిస్తాయని పురాణ ఇతిహాసాల్లో ఉందని
గుర్తు చేశారు. ఇందుకు భిన్నంగా ఈ చిత్రంలో సన్నివేశాన్ని తీయడం భక్తుల
మనోభావాలను దెబ్బ తీస్తుందన్నారు.
మరో ప్రక్క ఈ చిత్రంలో ప్రదర్శించిన కొన్ని సన్నివేశాలు హైదవుల, శ్రీరామ
భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లి
ఖార్జున స్వామి వారి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త మారగాని శ్రీనివాసరావు
ఆరోపించారు. శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవంలో అగ్ని ప్రమాదం సంభవించే
సన్నివేశంలో కేవలం హీరోలు తమ హీరోయిజాన్ని ప్రదర్శించటానికి పెట్టారని
విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.
శ్రీరామనవమి రోజున పంచభూతాలు సహకరిస్తాయనీ ఆ రోజు ప్రతి గ్రామంలోనూ
వరుణదేవుడు వర్షించి చల్లని వాతావరణాన్ని ప్రసాదిస్తారని తెలిపారు.
శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఎటువంటి ఆటంకాలకు, ప్రకృతి వైపరీత్యాలకు
గురైన దాఖలాలు నేటివరకు లేవన్నారు. చిత్రంలో ప్రదర్శించిన నన్నివేశాలు
యావత్తు హైందవులను, శ్రీరామ భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని
తెలిపారు. ఈ చిత్రం నుండి అభ్యంతరకరమైన నన్నివేశాలను తొలగించని పక్షంలో
కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
No comments:
Post a Comment