Search

Sunday 20 January 2013

షాకిచ్చేలా... పవన్,త్రివిక్రమ్ కొత్త చిత్రం విడుదల

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఆలోచనలో పడుతున్నారు. ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్న ఈ చిత్రం మే రెండవ వారంలో వేసవి కానుకగా శెలవులను టార్గెట్ చేస్తూ విడుదలను చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అంత త్వరగా నిజంగా రిలీజ్ అయితే షాకే అంటున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలు లేటుగా తయారవుతూండటం మొదటి నుంచీ జరుగుతున్నదే. అయితే ఈ సారి త్రివిక్రమ్ తన రెగ్యులర్ ధోరణికి భిన్నంగా స్పీడుగా ఈ షూటింగ్ ని ఏప్రియల్ కి మూడో వారానికి పూర్తి చేయాలని షెడ్యూల్ వేసినట్లు తెలుస్తోంది. పవన్ కూడా ఇదే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరామేన్ గంగతో రాంబాబు తరహాలో త్వరగా ఫినిష్ చేసి మరో ప్రాజెక్టులోకి వెళ్ళాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఆన్ లైన్ ఎడిటింగ్ చేస్తూ..షూటింగ్ తో పాటే ఎడిటింగ్ కూడాజరుపుతూ టైం సేవ్ చేయనున్నారని సమాచారం. కంటిన్యూగా హైదరాబాద్ ,స్పెయిన్ షెడ్యూల్స్ ఫినిష్ చేయనున్నారు.

pawan kalyan film release summer
ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం టైటిల్ ఖరారు కాలేదు. ‘సరదా', ‘హరే రామ హరే కృష్ణ' టైటిల్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర దర్శక నిర్మాతలు టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే.... తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రస్తుతం ‘తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా అధికారికంగా ఖరారు అయితే తప్ప దీన్ని నమ్మలేం. ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు. చిత్రం షూటింగ్ కోసంరామోజీ ఫిల్మ్ సిటీలో ఓప్రత్యేకమైన సెట్ ని వేయిస్తున్నారు. నిర్మాత బి.విఎస్ ఎన్ ప్రసాద్ దగ్గరుండి ఈ సెట్ ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సెట్ లో ఓ పాటను తీయనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ని ఈ సెట్ లో ప్రారంభిస్తారు. ఇప్పటికి దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం అదరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసాడని, పవన్ చాలా ఉత్సాహంగా ఈ షూటింగ్ పాల్గొనటానకి రెడీ అవుతున్నారని అంటున్నారు.

No comments:

Post a Comment

Popular Posts