
అహింసా మార్గం ద్వారా భారత దేశం స్వాతంత్రాన్ని సాధించిందని ఏఐసిసి
ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆదివారం జైపూర్‌లో మేధోమథన
సదస్సులో రాహుల్ ఏఐసిసి ఉపాధ్యక్షుడి హోదాలో తొలిసారి మాట్లాడారు. అరవై
ఏళ్ల కాంగ్రెసు చరిత్రలో ఎన్నో చారిత్రాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు
తీసుకుందన్నారు. తనను పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ
కృతజ్ఠతలు అన్నారు. పార్టీలో కింది స్థాయి నుండి పైస్థాయి వరకు అందరి
మద్దతు తనకు ఉందన్నారు.
దేశానికి స్వాతంత్రం తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా
గాంధీ మార్గాన్ని యుపిఏ ప్రభుత్వం అనుసరించిందన్నారు. సంస్కరణలతో
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారన్నారు.
ఆయన దేశ ప్రగతిని మార్చేశారన్నారు. హరిత విప్లవం దేశాన్ని సస్యశ్యామలం
చేసిందన్నారు. అన్ని రంగాలలో దేశం అభివృద్ధి సాధించిందని అన్నారు.
సామాన్యుడి వాణి వినిపించడమే కాంగ్రెసు లక్ష్యం అన్నారు. కాంగ్రెసు అప్పుడు
ఇప్పుడు ఎప్పుడూ అహింసనే నమ్ముకుంటుందన్నారు. సెల్‌ఫోన్ ద్వారా మనం
సాంకేతిక విప్లవం చూడవచ్చునన్నారు. సంస్కరణలు సామాన్యులకు అందాయనడానికి
సెల్‌ఫోన్ విప్లవమే ఉదాహరణ అన్నారు. కాంగ్రెసును దేశంలో ప్రతి ఒక్కరూ
సమర్థిస్తున్నారన్నారు. కొద్దిమంది ప్రజలే రాజకీయాలను ఎందుకు గుప్పిట్లో
పెట్టుకోవాలన్నారు.
అధికార వికేంద్రీకరణ అవసరమన్నారు. అధికార కేంద్రీకరణకు స్వస్తీ
చెప్పాలన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో పార్టీలో ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.
అధికారం ముఖ్యం కాదని విజ్ఞానం ముఖ్యమన్నారు. సగటు మనిషి అభిప్రాయం
అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. అవినీతిపరులే అవినీతి గురించి
మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని రంగాలలో మార్పులు విధిగా
అవసరమన్నారు. గాంధీజీ సిద్ధాంతాలే మా విధానాలు అన్నారు.
అవినీతి నిర్మూలనకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. తనకు పార్టీలో అరుదైన
గౌరవం దక్కిందని, పార్టీకి అంకితభావంతో పని చేస్తానన్నారు. ప్రజల
మనోభావాలకు అత్యంత గౌరవం ఇస్తామన్నారు. రూపాయిలో పదిహేను పైసలు మాత్రమే
నిరుపేదలకు అందుతున్నాయన్నారు. మహిళలను తొక్కి పెట్టేవారు మహిళా హక్కుల
గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి వాటి ద్వారా దేశానికి నష్టం
అన్నారు. యువత ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు.
భారత్‌లో లెక్కలేనన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. వ్యవస్థలో మార్పు
రావాలని, తాను ఆశావాదినని రాహుల్ అన్నారు. భారత సర్వతోముఖాభివృద్ధికి కొత్త
ఆలోచనలు కావాలన్నారు. కాంగ్రెసు పార్టీ ఓ కుటుంబం లాంటిదని, భారతీయులంతా
కాంగ్రెసులో చేరవచ్చు అన్నారు. యువత సమర్థత తనకు తెలుసు అన్నారు.
యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భారతీయులైన ప్రతివారి అభివృద్ధికి కాంగ్రెసు ప్రయత్నిస్తుందన్నారు.
అభివృద్ధి ఫలాలు సగటు మనిషికి చేరే విషయంలో అవినీతి చోటు
చేసుకుంటుందన్నారు. కాంగ్రెసు అనుబంద సంస్థలనన్నింటినీ తాను ఒకేవిధంగా
గౌరవిస్తానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకుకునేలా యువతను
తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో ఆమ్ ఆద్మీ ప్రధాన విధానం
కావాలన్నారు. దేశంలో హిపోక్రసీ అమలవుతోందని, కొందరు ఉన్నది లేనట్లుగా
లేనిది ఉన్నట్లుగా చెబుతున్నారన్నారు. అది సరికాదన్నారు.
కాంగ్రెసు పార్టీ సెక్యులరిస్ట్ నేతలను రూపొందిస్తుందన్నారు. దేశాన్ని
నడిపే శక్తిసామర్థ్యాలున్న నాయకులు కావాలన్నారు. కాంగ్రెసు పార్టీలో
కార్యకర్తలను ప్రోత్సహించాలన్నారు. కార్యకర్తలను గౌరవించే విధానం
కావాలన్నారు. ప్రజల ఆశల మేరకు నాయకులు పని చేయాలన్నారు. పని చేయని నేతలకు
ఒకటి రెండుసార్లు చెబుతామని, ఆ తర్వాత మార్చేస్తామన్నారు. పని చేయని
కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వవద్దన్నారు. కాంగ్రెసు లౌకికవాద పార్టీ అన్నారు.
కేవలం యువత కోసమే తాను ఉన్నానని అనుకోవడం పొరపాటు అని అందరికోసం పని
చేస్తానన్నారు. ప్రజల మనోభావాలకు కాంగ్రెసు గౌరవమిస్తుందన్నారు. సంక్షేమ
పథకాల ప్రయోజనం 99 శాతం ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టామన్నారు. ఆధార్, నగదు
బదలీ ద్వారా వంద శాతం అది నెరవేరుతోందన్నారు. నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి
రాజీవ్ గాంధీ హత్యలను రాహుల్ గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు.
తన నానమ్మ ఇందిర దారుణ హత్యకు గురయ్యారన్నారు. ఇందిర మృతదేహం చూసి నాన్న
రాజీవ్ గాంధీ విలపించారని కానీ, ఆ తర్వాత అతను కూడా హత్యకు గురయ్యారన్నారు.
ఈ విషయాలు ఉదయం స్మరణకు వచ్చాయన్నారు. నిన్న తాను ఉపాధ్యక్షుడిగా ఎంపిక
కావడాన్ని అందరూ అభినందించారని కానీ, తన తల్లి సోనియా రాత్రి
విలపించిందన్నారు. కీలక పదవి చేపట్టినందుకు తన తల్లి ఉద్వేగానికి
లోనయిందన్నారు. దేశ ప్రజలకు నా జీవితం అంకితమని, తాను చేపట్టే ఉద్యమానికి
అందరూ చేయూతనివ్వాలని కోరారు. కాంగ్రెసు పార్టీయే తన జీవితం అన్నారు. కాగా
ప్రసంగం చివరలో రాహుల్ ఉద్వేగానికి లోనుకావడం అక్కడున్న వారందరినీ కలచి
వేసింది.
No comments:
Post a Comment