ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో సెన్సార్ కూడా పూర్తి చేసుకుని ఫిబ్రవరి 8వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయటానికి సన్నాహాలు స్తున్నాం. ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రభాస్ ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాడు. ఆయన లుకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
ఈ చిత్ర నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రెస్టీజియస్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కించాం. కొరటాల శివ కథ మీద కమాండ్‌తో హైస్టాండర్డ్స్‌లో టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించారు. అన్ని వర్గాలవారిని అలరిస్తుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మది, ఎగ్జిక్యూటివ్‌నిర్మాత: అశోక్‌కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.
No comments:
Post a Comment