ఫిబ్రవరి 1న విడుదలైన రామ్ తాజా సినిమా “ఒంగోలు గిత్త” నిరాశ పరిచినా ఈ ఏడాది అంతా రామ్ బిజీగానే ఉండన్నునాడు.
ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిల్లో మొదటిది “బోల్
బచ్చన్” రీమేక్. ఇందులో విక్టరీ వెంకటేష్ మరో ప్రధాన పాత్ర
పోషించనున్నాడు. ఈ సినిమాని కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో స్రవంతి
రవికిషోర్ మరియు సురేష్ బాబులు నిర్మించనున్నారు. ప్రస్తుతం రామ్,”అందాల
రాక్షసి” మూవీ డైరెక్టర్ హను రాఘవాపుడితో చర్చల్లో పాల్గొంటున్నాడని
వినికిడి. ఈ కధా చర్చలు ముగింపు దశలో ఉన్నాయట. “సింహా”,”షాడో” సినిమాల
నిర్మాత పరుచూరి కిరీటి ఈ సినిమాని నిర్మించనున్నారు. పూర్తి వివరాలు
త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం కాలి గాయంతో బాధపడుతున్న రామ్ మార్చి
కల్లా కోలుకుంటాడు అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ మార్చ్ నుంచి సెట్స్
పైకి వెళతాడు.
Search
Friday, 15 February 2013
చమ్మక్ చల్లో – ప్రేమకి లాజిక్ లేదు, సినిమాలో మేజిక్ లేదు
విడుదల తేదీ : 15 ఫిబ్రవరి 2013 | ||||
దర్శకుడు : నీలకంఠ |
||||
నిర్మాత : డి.ఎస్.రావు | ||||
సంగీతం : కిరణ్ వారణాసి |
||||
నటీనటులు : వరుణ్ సందేశ్, సంచిత పడుకొనే, కేథరిన్ |
షో, మిస్సమ్మ సినిమాలతో వైవిధ్యమైన సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నీలకంఠ ఆ తరువాత ట్రాక్ తప్పాడు. సదా మీ సేవలో, విరోధి లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నా కమర్షియల్ గా మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేవు. దీంతో ట్రాక్ మార్చి రొటీన్ కమర్షియల్ సినిమాగా చమ్మక్ చల్లో చేసాడు. వరుణ్ సందేశ్, సంచిత పడుకొనే, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఈ చమ్మక్ చల్లో ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి విసుగొచ్చి ఇండియాకి వచ్చి తెలుగులో కొత్తగా ఏదైనా సినిమా తీద్దామనుకున్న కిషోర్ (అవసరాల శ్రీనివాస్) ఒక నిర్మాతని కలిస్తే లవ్ స్టొరీ చేద్దామని సలహా ఇస్తాడు. సరికొత్త లవ్ స్టొరీ కోసం వెతుకులాటలో లెక్చరర్ అప్పారావు అగర్వాల్ (షాయాజీ షిండే) కలుస్తాడు. కిషోర్ తీయబోయే సినిమా కోసం తన కాలేజీలో జరిగిన ఒక ప్రేమ కథని కిషోర్ కి చెప్పడం ప్రారంభిస్తాడు. ఇంజనీరింగ్ చదువుతున్న శ్యామ్ (వరుణ్ సందేశ్), అన్షు (సంచిత పడుకొనే) ఇద్దరూ మంచి స్నేహితులు. అప్పారావు అగర్వాల్ వారిని స్నేహాన్ని ప్రేమగా మారడానికి పునాది వేస్తాడు. కాలక్రమంలో ప్రేమలో పడ్డాక ఇద్దరి కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్ధం కూడా చేస్తారు. ఇప్పటి వరకు బాగానే ఉంది మరి కథలో ట్విస్ట్ లేదు కదా! ఇప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది. ఆ సమస్య ఏమిటి అనేది చమ్మక్ చల్లో మూల కథ.
ప్లస్ పాయింట్స్ :
సంచిత పడుకొనే కొన్ని యాంగిల్స్ లో బాగానే ఉంది. క్లోజ్ అప్ షాట్స్ లో మేకప్ బాగా ఎక్కువైంది కానీ నవ్వితే పర్వాలేదు. కేథరిన్ నటన శూన్యం కానీ స్కిన్ షో మాత్రం అడగకపోయినా అందాలు ఆరబోసేందుకు ట్రై చేసింది. మిగతా వారిలో వెన్నెల కిషోర్ కొద్దిసేపు నవ్వించే ప్రయత్నం చేసాడు. శ్యాం స్నేహితులలో నత్తివాడిగా చేసిన అబ్బాయి కూడా బాగానే నవ్వించాడు. అవసరాల శ్రీనివాస్ పాత్ర చాలా చిన్నది ఉన్నంతసేపు పర్వాలేదనిపించాడు. మిగతావారిలో బ్రహ్మాజీ, సురేఖ వాణి అందరూ రొటీన్ రొటీన్.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు నీలకంఠకి గతంలో విలక్షణ దర్శకుడిగా చాలా మంచి పేరు ఉంది. లవ్ కి లాజిక్ లేదు అంటూ రొటీన్ లవ్ స్టొరీ ఎంచుకుని మొదట్లోనే పట్టాలు తప్పాడు. రొటీన్ స్టొరీని ఎంచుకున్నపుడు కథనం అయినా కొత్తగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం ప్రేమికుల మధ్యలోకి మరో వ్యక్తి ప్రవేశించి మనస్పర్ధలు అపార్ధాలు ఈ కథతో ఇప్పటికి లెక్క లేనన్ని సినిమాలు వచ్చాయి. సన్నివేశాలైనా ఆసక్తిగా ఉంటే ప్రేక్షకుడు సీట్లో కూర్చోగలుగుతాడు. ప్రేమికులు మధ్య ఇగో సమస్యల్ని వారి అమాయకత్వం జోడించి నటీ నటుల ప్రదర్శన అయినా బావుంటే ఒడ్డున పడేయవచ్చు. ఎవరికి వారు చేతులెత్తేయడంతో పడవ కాస్తా నది సముద్రం మధ్యలో మునిగింది. వరుణ్ సందేశ్ రొటీన్ సినిమాలు ఎంచుకుంటూ నటన మీద ఆసక్తి లేకపోగా నటన కూడా నిర్లక్ష్యమే. కేథరిన్ సొంత డబ్బింగ్ చెప్పాలనుకోవడం మంచిదే కానీ కనీసం హోం వర్క్ చేయకుండా డబ్బింగ్ చెప్పడం అస్సలు బాలేదు. అతడి మొదటి సినిమా నుండి అదే నటన తప్ప ఇంత వరకు మార్పు లేదు. సినిమా మొదటి నుండి చివరి వరకు ఒకేలాగా ఏ మాత్రం కలిగించలేదు.
సాంకేతిక విభాగం :
కిరణ్ వారణాసి అందించిన పాటల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వినసొంపుగా లేవు. పైగా చందమామ పై కుందేలా, కత్రినా, చమ్మక్ చల్లో పాటలు సహనానికి పరీక్ష పెట్టాయి. నేపధ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. ఇంకోసారి, విరోధి లాంటి సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన రంగనాథ్ గోగినేని ఈ సినిమాలో లోక్వాలిటీతో ఉంది. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు.
తీర్పు :
అందరూ చేసే సినమాలు మనం చేయకూడదు, ఏదైనా కొత్తగా చేస్తే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అందరూ తీసే రొటీన్ లవ్ స్టొరీ సినిమాలు నీలకంఠ లాంటి దర్శకులు కూడా చేయడం మొదలుపెడితే ఫలితాలు ఇలాగె ఉంటాయి. నీలకంఠ ఇకనైనా ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకుంటే బెటర్.
మంత-సిద్ధార్థ్ ‘జబర్‌దస్త్’ సెన్సార్ రిపోర్ట్
సిద్ధార్థ-సమంత జంటగా నటిస్తున్న ‘జబర్‌దస్త్' మూవీ ఈ రోజు సెన్సార్
కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్స్ బోర్డ్ సభ్యులు U/A
సర్టిఫికెట్ జారీ చేసారు. ఫిబ్రవరి 22న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నారు. ‘అలా మొదలైంది' ఫేం నందినీరెడ్డి ఈచిత్రానికి
దర్శకత్వం వహిస్తున్నండగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయిగణేష్
ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ
చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన
వస్తోంది. అలా మొదలైంది చిత్రాన్ని యూత్ అండ్ ఫ్యామిలీ మెచ్చేలా
వినోదాత్మకంగా తెరకెక్కించిన దర్శకురాలు నందినీరెడ్డి ‘జబర్‌దస్త్'
చిత్రాన్ని మాస్ మసాలా అంశాలతో తెరకెక్కించారు.
ఈ చిత్రంలో సిద్ధార్థ పాత్ర విభిన్నంగా ఉండటంతో మంచి కామెడీ టైమింగుతో ఉంటుంది. అదే విధంగా హీరోయిన్ సమంత పాత్ర రౌడీలా ఉంటుందట. ఈ విషయాలు స్వయంగా దర్శకురాలు నందినీ రెడ్డి వెల్లడించారు. మొత్తానికి ఈచిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది అంటున్నారు.
సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి .మహేంద్రబాబు, నిర్మాత : బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బి.వి.నందినిరెడ్డి.

వివి వినాయిక్ కొత్త చిత్రం ఈ రోజే ప్రారంభం
ప్రముఖ నిర్మాత, శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ అధినేత బెల్లంకొండ సురేశ్
పెద్ద కుమారుడు శ్రీనివాస్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి
తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో ఒకరైన వి.వి. వినాయక్
దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. బెల్లంకొండ సురేశ్
స్వయంగా నిర్మించే ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్స్ ల్లో
ఒకరైన సమంత నటిస్తుండటం విశేషం.
కొంత కాలం క్రితం రెండు నెలల పాటు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సురేశ్ అండగా నిలిచి ఆదుకున్నారనీ, ఆ కృతజ్ఞతతో శ్రీనివాస్ సరసన చేస్తున్నాననీ ఇప్పటికే సమంత తెలిపింది. కొంతకాలంగా శ్రీనివాస్ నటన, డాన్స్, ఫైట్స్ వంటి విభాగాల్లో చక్కని శిక్షణ తీసుకుంటూ వచ్చాడు. అతను హీరోగా నటించే సినిమా శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభం కాబోతోంది. శ్రీనివాస్‌ని ఆశీర్వదించడానికి చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.
ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. నాయక్ చిత్రం తర్వాత వినాయిక్ చేస్తున్న చిత్రం ఇదే. వినాయిక్ మొదటి చిత్రం ఆది కి నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యానర్ మీదే చేయటంతో ఆ అనుబంధం ఇలా కొనసాగుతోంది.
అలాగే సమంత ఇప్పటికే బెల్లంకొండ సురేష్ నిర్మాతగా రూపొందుతున్న నందిని రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఎన్టీఆ్రర్ తో చేయనున్న చిత్రంలోనూ ఆమెనే ఎంపిక చేసారు. ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ బెల్లంకొండ సురేష్ ..చిత్రం ప్రకటన చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ విషయం ఖరారు చేసారు. అలాగే ఎన్టీఆర్ సరసన సమంత నటించనుందంటూ తెలియపరిచారు. దాంతో బెల్లంకొండ సురేష్ మరోసారి సమంతకు తన సరసన అవకాసమిచ్చినట్లు అయింది.

ఆమెది వేడి పుట్టించే పాత్ర: వైవియస్ చౌదరి
బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో
నిర్మిస్తున్న చిత్రం ‘రేయ్'. సాయిధరమ్‌తేజ్, సయామిఖేర్, శ్రద్ధాదాస్
ఇందులో హీరోహీరోయిన్లు. శ్రద్ధాదాస్ పాత్ర గురించి చౌదరి వివరిస్తూ
-‘‘ఇందులో శ్రద్ధ అమెరికన్ పాప్‌స్టార్ జెన్నీగా నటిస్తున్నారు. పాప్ సంగీత
ప్రపంచంలో తనకెవరూ ఎదురు రాకూడదనుకునే పాత్ర తనది. ఓ రకంగా చెప్పాలంటే ఈ
సినిమాలో తనది వేడి పుట్టించే పాత్ర. ఈ చిత్రం తర్వాత శ్రద్ధాదాస్‌కు
అభిమానుల ఆదరణ బాగా పెరుగుతుంది'' అన్నారు.
అలాగే ‘‘ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో జ్యోతిలక్ష్మి, సిల్క్‌స్మితల అప్పియరెన్స్, డాన్సులంటే నాకు ఇష్టం. ఆ రకంగా మళ్లీ జ్యోతిలక్ష్మి, హలం ఫ్యాన్ ఫీచర్స్ శ్రద్ధాదాస్‌లో కన్పించాయన్న ఫీలింగ్ ఉంది'' అని వైవీయస్ చౌదరి చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: యలమంచిలి గీత.
.ఇందుకోసం ఆమె కాస్ట్యామ్స్ దగ్గరనుంచి అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని,స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ,కిక్ బాక్సింగ్,యోగా ప్రాక్టీస్ చేస్తోంది.అలాగే వైవియస్ చౌదరి కూడా ఓ రేంజిలో శ్రద్దాదాస్ అందాలను తెరకెక్కించి,కిక్ ఇవ్వటానికి రెడీ అయ్యిపోయాడని తెలుస్తోంది.ఆమె ఈ చిత్రంలో శృంగార దేవతలా అనిపిస్తుంది అంటున్నారు.ఇక వైవియస్ చౌదరి చిత్రాలన్నిటిలోనూ హీరోయిన్ ని అందంగా చూపెడతారనే సంగతి తెలిసిందే.ఇలియానాని తెలుగు తెరకు పరిచయం చేసి,ఆమె కెరీర్ కి పునాది వేసిన చౌదరి తనకూ బ్రేక్ ఇస్తాడని శ్రద్దాదాస్ ఆశతో ఎదురచూస్తోంది.
ఇక చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి 'రేయ్' పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినీ సెటిల్ మెంట్: వీరప్పన్ భార్యకు రూ.25 లక్షల పరిహారం
గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ జీవిత విశేషాల ఆధారంగా
తీసిన 'వనయుద్ధం' చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మేరకు
సుప్రీంకోర్టు నుంచి నిర్మాతలకు అనుమతి లభించింది. ఈ చిత్రం విడుదల తర్వాత
తమ కుటుంబం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం
చేస్తూ వీరప్పన్ భార్య వి.ముత్తులక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీంతో అక్షయ క్రియేషన్స్ నిర్మాతలు రూ.25 లక్షలను పరిహారంగా ఆమెకు
అందజేసేందుకు ముందుకొచ్చారు.
మరో ప్రక్క వీరప్పన్ నలుగురు అనుచరుల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించడం పట్ల అంతర్జాతీయ కారుణ్య సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' ఆందోళన వ్యక్తం చేసింది. వారికి శిక్ష విధించడాన్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
తన భర్తను ఉరితీస్తే కుటుంబంతో సహ ఆత్మహత్యకు పాల్పడతానని వీరప్పన్ అనుచరుడు మాదయ్య భార్య తంగమ్మాల్ పేర్కొంది. 1993లో తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని పాలార్ వద్ద మందు పాతర పేల్చి 21 మందిని బలితీసుకున్న కేసులో వీరప్పన్ అనుచరులు జ్ఞానప్రకాశం, సియోన్, మాదయ్య, జితేందర్‌లకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. వీరు పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు.
దీంతో మాదయ్య భార్య తంగమ్మ మాట్లాడుతూ.. భర్తకు ఉరిశిక్ష విధిస్తే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. మరోవైపు, వీరప్పన్ అనుచరులకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ వీసీకే అధినేత తిరుమావళవన్, పీఎంకే నేత రామదాసు డిమాండ్ చేశారు. వీరప్పన్ సహచరులైన నలుగురికి ఉరి వేసేందుకు అధికారులు ఇక్కడి హిండలగా జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉరి రిహార్సల్స్ నిర్వహించారు. ఉరిశిక్షను ఎప్పుడు అమలు చేసేదీ వెల్లడించేందుకు జైలు అధికారులు నిరాకరించారు.

‘అందాల రాక్షసి’దర్శకుడు నెక్ట్స్ చిత్రం ఖరారు
అందాల రాక్షసి' చిత్రంతో దర్శకునిగా మారిన హను రాఘవపూడి మరో చిత్రం
కమిటయ్యారు. రామ్ హీరోగా ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని
పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్
హీరోగా ‘షాడో' చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
‘షాడో' విడుదలకు ముందే రామ్‌తో నిర్మించే చిత్రం ప్రారంభోత్సవం ఉంటుందని
తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని మెహర్ రమేష్ సెట్ చేసినట్లు
చెప్పుకుంటున్నారు.
‘అందాల రాక్షసి' చిత్రం ఫెయిలైనా చిత్రం తో టెక్నీషియన్‌గా మంచి పేరు సంపాదించారు హను రాఘవపూడి. దాంతో ఇంప్రెస్ అయిన రామ్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రామ్ హీరోగా రీసెంట్ గా విడుదలైన ఒంగోలు గిత్త చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
రామ్ ఈ చిత్రంతో పాటు విజయ్ భాస్కర్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు.వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో 'బోల్ బచ్చన్' రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. తమాషా కథాంశంతో ఆద్యంతం వినోదాన్ని పంచిపెట్టిన బాలీవుడ్ చిత్రం 'బోల్ బచ్చన్'. వచ్చీ రాని ఆంగ్లంతో అజయ్ దేవగణ్, ఒక్కడే అయినా ఇద్దరిలా ప్రవర్తించే అభిషేక్ బచ్చన్‌ల పాత్రలు భలే నవ్వించాయి. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో పునఃనిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అజయ్, అభిషేక్‌ల పాత్రల్లో వెంకటేష్, రామ్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
డి.సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయి. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్ సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు. ‘గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ ‘గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

వెండి తెరపై హర్భజన్, ఆ సినిమాలో గెస్ట్ రోల్...
టీమిండియా స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ త్వరలో వెండితెరపై
కనిపించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ‘భా
జీ ఇన్ ప్రాబ్లమ్' అనే పంజాబీ చిత్రంలో హర్భజన్ నటించబోతున్నాడు.
ఈచిత్రాన్ని గ్రాజింగ్ గోట్ పిక్చర్స్ పతాకంపై అక్షయ్ కుమార్, అశ్విని
యార్డి ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో హర్భజన్ పాత్ర ఏమిటనే విషయం ఇప్పటి వరకు బయటకు రాక పోయినప్పటికీ....ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. భజ్జీ పోషిస్తున్న పాత్ర ఏమిటో బయటికి తెలియకుండా దర్శక నిర్మాతలు సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. ఏది ఏమైనా భజ్జీ తొలిసారిగా వెండితెరపై కనిపిస్తుండటంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఐపీఎల్-6 సీజన్ కంటే ముందే షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పంజాబీ యాక్టర్స్ జిప్పీ గ్రేవాల్, గుర్పీత్ తదితరులతో కలిసి హర్భజన్ షూటింగులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి అశ్విని యార్ది మాట్లాడుతూ....భజ్జీ పాత్ర ఆయన అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని వెల్లడించారు.
గ్రాజింగ్ గోట్ పిక్చర్స్ గతంలో ‘ఓ మై గాడ్' అనే హిందీ చిత్రంతో పాటు, మరాఠీలో ‘72 మైల్స్' చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు ‘భా జీ ఇన్ ప్రాబ్లమ్' అనే చిత్రం ద్వారా పంజాబీ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోంది.

ఇలియానా కి పంచ్ ఇచ్చిన కాజల్
కాజల్ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ...సినిమా పూర్తవగానే అక్కడికి
అయిపోయిందని చేతులు కడిగేసుకోవటం నా వల్ల కాదు. ఆ సినిమా ప్రమోషన్ కూడా నా
భాధ్యతగానే భావిస్తాను అంది. ఈ స్టేట్ మెంట్ విన్న వారంతా కాజల్ కావాలనే
ఇలియానాని ఉద్దేశించి అన్నదని,అలాగే పనిలో పనిగా తనను తాను చక్కగా ప్రమోట్
చేసుకుంటోందని అంటోంది.
బాలీవుడ్ మోజులో పడి అవకాసాలు దూరం చేసుకుంటున్న ఇలియానాపై ఆ మధ్య తెలుగు పరిశ్రమ మండిపడింది. ఆమె సినిమా ప్రమోషన్స్ లో పాలుపంచుకోవటంలేదని సీరియస్ అయ్యింది. దాంతో ఆమెకు పెద్ద బ్యానర్స్ వారు దూరం పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో చేసిన శక్తి చిత్రం సమయంలో ప్లాపైన సినిమాకు ప్రమోషన్ చేసినా ఫలితం ఉండదు అని మాట్లాడి అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత దేముడు చేసిన మనుష్యులు, జులాయి చిత్రాలలో చేసినా..ఆ ప్రమోషన్ లో పాల్గొనలేదు. దాంతో తెలుగు పరిశ్రమలో ఆమెపై వ్యతిరేక భావన పెరిగింది.
ఈ వ్యతిరేక భావనను కాజల్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నట్లు కనపడుతోంది. తాను బాలీవుడ్ కి వెళ్ళినా ఇక్కడ సినిమాలపైనే దృష్టి ఉంటుందని,ప్రమోషన్ ఏక్టివిటీస్ లో పాల్గొంటానని చెప్పింది. అయితే బాలీవుడ్ లో సినిమా కమిటయ్యేటప్పుడే ప్రమోషన్ ఏక్టివిటీస్ గురించి ఎగ్రిమెంట్ ఉంటుంది. దాంతో ఇష్టమున్నా లేకపోయినా ప్రమోషన్ లో పాల్గొనాల్సిందే. అందునిమిత్తం రెమ్యునేషన్ తో పాటే మాట్లాడుకుంటారు. రీసెంట్ గా కాజల్ చేసిన స్పెషల్ ఛబ్బీస్ చిత్రం బాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఆమె ఉత్సాహానికి అంతేలేకుండా పోయింది.

నాగ్ ‘గ్రీకు వీరుడు’విడుదల తేదీ ఖరారు
నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం ‘గ్రీకు వీరుడు'.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రియల్ 19న విడుదల
చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ఆడియో మార్చి రెండవ
వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ నెల 14తో ఒక పాట మినహా షూటింగ్
పూర్తి అయ్యింది. మిగిలివున్న ఒక్కపాటను ఈనెల 22 నుంచి హైదరాబాద్‌లో భారీ
సెట్ వేసి చిత్రీకరిస్తారు. తమన్ ఈ చిత్రానికి ఆరు పాటల్ని అందిస్తున్నారు.
కామాక్షి మూవీస్ పతాకంపై దశరధ్ దర్శకత్వంలో డి. శివవూపసాద్‌డ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దశరథ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘అమెరికాలో పుట్టి పెరిగిన ఓ ప్రవాసాంవూధుడి కథ ఇది. అతను మొదటిసారి ఇండియాకు వచ్చినప్పుడు ఎదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. ‘సంతోషం' ‘మన్మథుడు' చిత్రాల తరహాలో వినోదం మేళవించిన కుటుంబ కథా చిత్రమిది' అన్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘చాలాకాలం తర్వాత నాగార్జున చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. నాగ్, నయనతార కాంబినేషన్‌లో సాగే ప్రేమకథ అన్ని వయసుల వారికీ నచ్చుతుంది. ఇందులో కొత్త నాగార్జునను చూస్తారు. మార్చిలో పాటలను విడుదల చేస్తాం'' అని తెలిపారు.
గ్రీకు వీరుడు'లో నాగార్జున ఓ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.
మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, సంగీతం: తమన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: రవీందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేకానంద కూచిభొట్ల, సహ నిర్మాత: డి.విశ్వచందన్‌రెడ్డి, నిర్మాణం: కామాక్షి మూవీస్.

నమ్మకమైన కుక్క, చెడ్డ పిల్లాడు=కసబ్ : వర్మ
వాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముంబైపై దాడి సంఘటనపై సినిమా
రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘26/11 ఇండియాపై దాడి' పేరుతో
రూపొందుతున్న ఈ చిత్రంలో ముంబై దాడుల సంఘటనలను కళ్లకు కట్టినట్లు
చూపెట్టనున్నారు.
అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడదల కానుంది. దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ కసబ్ పాత్ర గురించి మాట్లాడుతూ...చెడు మనస్తత్వం గల పిల్లాడు, నమ్మకమైన కుక్క కలగలిపితే కసబ్. అతని గురించి నాకు పూర్తిగా తెలియక పోయినా పోలీసులు చెప్పిన వివరాలు, సిసి టీవీ పుటేజిల్లో అతని ప్రవర్తన, ఇతరత్రా అంశాలను బేస్ చేసుకుని కసబ్ పాత్రను రూపొందించినట్లు వర్మ వెల్లడించారు.
''మనలో చాలా మందికి ముంబై దాడుల గురించి తెలుసు. కానీ వాటి వెనక ఉన్న కొన్ని సంఘటనలు, వ్యక్తుల భావోద్వేగాలు చాలా మందికి తెలియవు. వాటిని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. ఆ దాడుల్ని ప్రత్యక్షంగా చూసిన పలువురు పోలీసులు, బాధితులతో మాట్లాడా. ప్రత్యేకంగా ఒక మతంపైనో, ఒక సముదాయంపైనో జరిగిన దాడులు కావవి. మానవత్వంపైన జరిగిన దాడులుగా అర్థమైంది. ఈ ఒక్క చిత్రంతో ఆ విషాదాన్ని, అక్కడ కొందరు చేసిన సాహసాల్ని నేను పూర్తిగా చూపించలేకపోవచ్చు. భవిష్యత్తులో ఈ సంఘటనపై మరెవరైనా సినిమా తీసినా ఆ దాడుల్లో కొద్దిమేరకే చూపించగలుగుతాం'' అని వర్మ అన్నారు.

సమంత-బెల్లంకొండ శ్రీనివాస్ హాట్‌గా..(ఫస్ట్ లుక్ స్టిల్స్)
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ను
ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్
చేసిన సంగతి తెలిసిందే. సమంతను హీరోయిన్‌గా చాలా రోజుల క్రితమే ఎంపిక
చేసారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్ లో
జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంబోత్సవ కార్యక్రమానికి దాసరి నారాయణరావుతో పాటు, రాఘవేంద్రరావు, వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరో వైపు బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ నెట్కర్కింగ్ పేజ్ ద్వారా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్స్ ను విడుదల చేసారు.
వివి వినాయక్ దర్శకత్వం కావడం, సమంత హీరోయిన్ గా చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ పరంగా ఫర్వాలేదనిపిస్తున్నాడు. మరి వెండితెరపై ఏ మేరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.

సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా
ప్రఖ్యాత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు శంకర్, ప్రఖ్యాత
దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి......ఓ తెలుగు సినిమా ద్వారా వెండితెరకు
పరిచయం అవుతున్నారు. 'సీమటపాకారు' ఫేమ్ పూర్ణ కథానాయిక. 'తెలుగులో నాకు
నచ్చని పదం ప్రేమ' టైటిల్ తో రూపొందుతున్న ఈచిత్రం ముక్కోణపు ప్రేమకథా
చిత్రం. ప్రేమకు వ్యతిరేకం అనే విధంగా రూపొందుతున్న ఈచిత్రం ప్రేమికుల రోజు
రోజున ప్రారంభోత్సవం జరుపుకోవడం విశేషం.
ఈ చిత్రానికి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. 'దండుపాళ్య' నిర్మాత నారాయణ్‌బాబు నిర్మాత. యాపిల్ బ్లోస్సమ్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి గాయని వసుందరాదాస్ క్లాప్ ఇవ్వగా, సీతారామశాస్త్రి స్విచ్చాన్ చేశారు. పి.వాసు గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం సీతారామశాస్త్రి మాట్లాడుతూ, టైటిల్‌లోనే గమ్మత్తు ఉంది. కన్నడ నిర్మాతలు తెలుగులోకి వస్తున్నారు. కన్నడ, తమిళంలో దర్శకునిగా పనిచేసిన రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్ సమకాలీకుడు పీతాంబరం తనయుడుపి.వాసు. ఆయన తనయుడు, నా బిడ్డ హీరోలుగా నటిస్తున్నారు. పిల్లల కెరీర్ విషయంలో స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తున్నాం' అన్నారు.
పి.వాసు మాట్లాడుతూ, తెలుగు సినిమాలకు కథలిచ్చాను. దర్శకత్వం వహించా. పరిశ్రమ హైదరాబాద్ తరలిరావడం తమిళపరిశ్రమకు నష్టం. తెలుగువారి అభిరుచి, కళానిపుణత గొప్పది. అదంతా చిన్నప్పుడే నాన్న పీతాంబరంతోపాటు ప్రత్యక్షంగా చూశాను. అందుకే తెలుగంటే చాలా ఇష్టం' అన్నారు. ఎవరూ ప్రయత్నించని, కొత్తకోణంలో ప్రేమకథను తెరకెక్కిస్తున్నానని దర్శకుడు తెలిపారు. తెలుగులో తమకిది తొలిచిత్రమని నిర్మాతలు తెలిపారు. అలీ, బ్రహ్మానందం, నిషా కొఠారి, నాగబాబు, సీత, షిండే, సితార తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: పికెహెచ్. దాస్, సంగీతం: మణిశర్మ, మాటలు: రాఘవ, రాఘవ టి, కథ, కథనం, దర్శకత్వం: రాఘవ.

మగాళ్లు సెక్స్ కోసమే' అన్న హీరోయిన్ కేసుపై హైకోర్టు స్టే
నటి సోనా కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సిన అవసరం లేదని మద్రాసు
హైకోర్టు పేర్కొంది. పురుషులకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు కించపరిచేలా
ఉన్నాయని ఎగ్మూరు మేజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనికి
సంబంధించి కోర్టుకు హాజరు కావాలని ఆమెకు ఆదేశాలు జారీ అయ్యాయి. నేరుగా
హాజరుకు మినహాయింపు ఇవ్వాలని సోనా మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.
న్యాయమూర్తి కృపాకరన్ బుధవారం దీన్ని విచారించారు. సోనా తరఫు న్యాయవాది
తంగశివన్ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి సానుకూల ఆదేశాలు జారీ చేశారు.
పురుషులను కించపరిచే విధంగా మాట్లాడిన సినీనటి సోనాపై ఎగ్మూర్ కోర్టులో నమోదైన కేసుపై స్టే విధిస్తూ బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పురుషుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నటి సోనా మాట్లాడిందని, ఆమెపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో పురుషుల భద్రతా సంఘం కేసు నమోదు చేసింది. దీనిపై నేరుగా హాజరు కావాలని సోనాకు కోర్టు సమన్లు పంపింది.
నేరుగా హాజరు కావడంపై మినహాయింపు ఇవ్వాలని, కేసు రద్దు చేయాలని మద్రాసు హైకోర్టులో సోనా పిటిషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తి బుధవారం విచారించారు. నటి సోనా ఎగ్మూర్ కోర్టులో హాజరు కావడంపై మినహాయింపు ఇచ్చారు. సోనాపై ఎగ్మూర్ కోర్టులో నమోదైన కేసు విచారణపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సోనా రీసెంట్ గా ఓ వీక్లీ మ్యాగజైన్ తో మాట్లాడుతూ...మగాళ్ళు టిష్యూ పేపర్స్ వంటివారు. వారిని సెక్స్ కోసం వాడుకుని పారేయాలి. వివాహం అనేది ఫూలిష్ నెస్. చాలా మంది పూలిష్ అమ్మాయిలు వివాహం పేరుతో కలిసి ఉంటున్నారు అంటూ రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసింది. సోనా తీరును హిందూ మక్కల్ కట్చి సైతం తప్పుబట్టింది. ఆమె పురుషులను చెత్తకాగితంతో పోల్చి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించింది. సంస్కృతి సంప్రదాయాల్ని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్న సోనాను అరెస్టు చేయాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి కుమార్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సంఘాలు సైతం ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పాలని పిలుపునిచ్చారు.

మహేష్ సినిమా కథ 1950లో జరుగుతుంది
మహేష్ త్వరలో చేయబోయే శివం చిత్రం 1950లో జరుగుతుంది. ఈ విషయాన్ని
క్రిష్ స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షినే
తీసుకోవాలని ప్రత్యేకంగా అనుకోవటానికి కారణం చెప్తూ ఈ విషయం వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ... ఈ సినిమా 1950లో జరుగుతుంది. ఈ కథలో హీరోయిన్ పాత్ర
సినిమాకు చాలా కీలకం. ఈ సినిమా కోసం హీరోయిన్ పాత్ర రాసుకుంటూంటే నా
మనస్సులో సోనాక్షినే మెదిలింది. సినిమా లో ఆమెపాత్ర పేరు మీనాక్షి అన్నారు.
అలాగే సోనాక్షి అందంగా ఉండటమే కాక అందమైన కళ్లు ఉండాలి. నేను దబాంగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని పవర్ ఉంది. ఆ కళ్లు చాలా ఎక్సప్రెసివ్ గా ఉంటాయి అంటూ ఆయన వివరించారు. ఈ సంవత్స రం లోనే సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం అశ్వనీదత్ నిర్మించనున్నారు. సుకుమార్ చిత్రం షూటింగ్ పూర్తవగానే ఈ చిత్రం పూర్తవుతుంది. క్రిష్ చిత్రం పూర్తయ్యాక శ్రీనువైట్లతో చేసే ఆగడు ప్రారంభమవుతుంది.
సోనాక్షి ట్విట్టర్ లో... ''అవును. నేను మహేష్‌తో నటిస్తున్నా. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. అందులో నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. తొలిసారి తెలుగులో, అందులోనూ మహేష్ బాబు లాంటి హీరోతో నటించడం ఆనందంగా ఉంది''అని రాసుకొంది సోనాక్షి. ఇక ఈ చిత్రానికి సి.అశ్వనీదత్ నిర్మాత.
ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు స్పష్టం చేసిన క్రిస్... ఈ ఏడాది సమ్మర్లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ నేపథ్యంలో రూపొందించేందుకు దర్శకడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈచిత్రానికి ‘శివం' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది.
గతంలో ఓసారి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు, అతనితో నటించే అవకాశం వస్తే తెలుగులో సినిమా చేయడానికి రెడీ అంటూ బదులిచ్చిన సంగతి తెలిసిందే. . ఇక పోతే క్రిష్ దర్శకత్వం వహించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం బాక్సాఫీసు వద్ద సరైన ఫలితాలను ఇవ్వలేదు.

బాలకృష్ణ సరసన సమీరా రెడ్డి ఎంపిక
గ్గుపాటి రాణా కృష్ణం వందే జగద్గురం చిత్రంలో ఐటం సాంగ్ చేసిన సమీరా రెడ్డి
తాజాగా మరో తెలుగు చిత్రం కమిటైంది. బాలకృష్ణ సరసన ఆమెకు హీరోయిన్ గా ఆఫర్
వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఆమె చాలా కాలం తర్వాత తెలుగులో హీరోయిన్ గా
అవకాసం రావటంతో చాలా ఉత్సాహంగా ఉంది. అయితే బాలకృష్ణ చేస్తున్న ఏ చిత్రంలో
ఆమె చేయనుందని మాత్రం తెలియరాలేదు. కానీ బాలకృష్ణ డైరక్ట్ చేసే చిత్రంలో
చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.
బాలకృష్ణ త్వరలో దర్శకుడుగా కనపించటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ సిని రచయిత హరినాధరావు, వేణు ఈ చిత్రం స్క్రిప్టుపై పనిచేస్తున్నట్లు సమాచారం. దర్శకత్వంపై మక్కువ బాలయ్యకు ఇప్పుడు కొత్తగా పుట్టిందేంకాదు. గతంలోనే ఆయన ‘నర్తనశాల' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో చేసే ప్రయత్నం చేశారు.
పైగా అర్జునుడు, బృహన్నల, కీచకుడు, కృష్ణుడు, సుయోధనుడు పాత్రలను అందులో బాలయ్య నటిస్తారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ద్రౌపది పాత్రకు ఎంచుకున్న సౌందర్య ఆకస్మిక మృతితో ఆ సినిమా నిర్మాణం పక్కకు వెళ్లిపోయింది తర్వాత ‘శ్రీరామరాజ్యం' తర్వాత మళ్లీ బాలకృష్ణ ‘నర్తనశాల'ను ట్రాక్ పైకి తీసుకురానున్నారనీ, నయనతార ద్రౌపదిగా నటిస్తారనీ ఓ వార్త మీడియాలో షికారు చేసింది. అయితే అది నిజమో కాదో తేలో లోగా...... ఈ తాజావార్త వెలుగు చూసింది. ఓ జానపద చిత్రం ఈ సినిమా. అలాగే ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్‌కి వెళ్లనుందని విశ్వసనీయ సమాచారం.
‘శ్రీమన్నారాయణ' చిత్రం తర్వాత బాలయ్య వేరే ఏ సినిమాకూ సైన్ చేయలేదు. హీరోగా కెరీర్ మొదలైన తర్వాత ఆయన ఇంత గ్యాప్ తీసుకోవడం ఇదే ప్రథమం. బాలయ్య విరామానికి కారణం ఏంటో అంతుపట్టని స్థితిలో ఆయన అభిమానులు ఉన్నారు. అలాంటి సమయంలో వెలుగుచూసిన ఈ వార్త అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే... త్వరలోనే బాలకృష్ణలోని దర్శక కోణాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారన్నమాట.

Thomas Jane Enters The Wet House
Former Punisher and Mist-battler Thomas Jane had a rough ride with the studio bods on his last directorial effort Dark Country. He publicly complained about the final cut and the lack of a theatrical release, but the experience doesn't seem to have burned him too badly, since he's about to head back behind the camera for The Wet House, in which he'll also star.
The title refers to an establishment that's kind of the polar opposite of a rehab facility: a wet house is apparently a place where substance abusers and addicts go to die, when their afflictions place them beyond recovery. It's a new one on us, but writer Jack Reher seems confident that it's a thing. The film's story involves a doctor at the facility - presumably Jane's character - enduring a haunting and slowly losing his mind.
Reher's screenplay is loosely based on, of all things, a short story by Charles Dickens. The Signalman, one of Dickens' Christmas ghost stories, sees the titular railway worker haunted by a spectre that repeatedly warns of accidents not long before they happpen. The Wet House echoes that set up, with the doctor encountering a patient who can similarly call tragedies in the making.
We're told that the film will be tonally along the lines of Jacob's Ladder, Poltergeist and Secret Window, so there are clearly drug freak-outs, spooks and twists afoot. It's the second project for Jane and Reher together: Reher also wrote Red Machine, the man-vs-grisley-bear quickie in which Jane stars with Billy Bob Thornton, James Marsden and Scott Glenn. That one's supposed to surface in the summer, while The Wet House is still coming together.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
-
-
Actress Shruti Hassan who has replaced Samantha in Mega Powerstar Ram Charan’s ‘Yevadu’ would join the shoot of the film from January 4....
-
It is known that Gautham Menon directed Neethane En Ponvasantham and Prabhu Solomon’s Kumki are slated for a grand release on 14th of D...
-
Presence of Mega Star is always a morale booster for technicians and directors. The same situation happened for director Apoorva Lakhia ...
-
Dil Raju is a very happy man these days. His film ‘Seethamma Vakitlo Sirimalle Chettu’ is doing very well and he has been receiving wides...
-
Young Tiger NTR’s forthcoming movie ‘Baadhshah’ shooting is progressing at fast pace in RFC. A high voltage action sequence involving Jr...
-
Mega Power Star Ram Charan’s “Naayak” is hitting the big screens for Sankranthi festival. Kajal Agarwal and Amala Paul are the heroines in...
-
Company Name: Cisco Systems Inc Website: www.cisco.com Qualification: BS EE/CS Experience: 0-3 Years Loca...
-