Search

Sunday, 27 January 2013

'దూకుడు' మహేష్ బాబు 'ఆగడు'లో సోనమ్ కపూర్!

mahesh babuటాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా 'ఆగడు' చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రనటి సోనమ్ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. 'ఆగడు' చిత్రం దూకుడుకు సీక్వెల్‌గా రూపొందుతున్నట్టు సమాచారం.

ఆగడు చిత్రానికి సంబంధించిన కథను కోన వెంకట్ తయారు చేశారు. స్క్రీప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయింది. ప్రస్తుతం శ్రీను వైట్ల.. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న "బాద్ షా" సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే, మహేష్ బాబు కూడా సుకుమార్ సినిమాలో బిజీగా మారారు.

ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత 'ఆగడు' చిత్రం షూటింగ్ ప్రారంభంకానుంది. అయితే, దూకుడు నిర్మాతలు తెరకెక్కించే ఈ ఆగడులో బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ హీరోయిన్‌గా ఎన్నికైనట్లు తెలుస్తుంది.

No comments:

Post a Comment

Popular Posts