Search

Saturday, 19 January 2013

2 ½ ఏళ్లుగా ‘బహుబలి’ మూవీ ప్లాన్స్ : ప్రభాస్

Young Rebel Star Prabhas About Baahubali Project
హైదరాబాద్ : ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో రూపొందబోయే భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ‘బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావుకు చెందిన ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ‘బహుబలి' అని ప్రభాస్ అధికారికంగా వెల్లడించడంతో పాటు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రేక్షకులతో పాటు ప్రభాస్ కూడా ఈ సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ సినిమా గురించి ఆయన ఏమంటున్నారో ప్రభాస్ మాటల్లోనే... ‘‘మా బేనర్లో రాఘవేంద్రరావు బొబ్బిలి బ్రహ్మన్న సినిమా చేసి పెద్దనాన్నకు పెద్ద హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సొంత బేనర్లో సినిమా చేస్తున్నందుకు ఎంతో అదృష్టంగా ఫీలవుతున్నాను. మేము ఈ సినిమాను 2 ½ ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నాం. ఎట్టకేలకు సినిమా ప్రారంభ దశకు చేరుకుంది. ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగా ఉంది. ఈ సినిమాను నేను ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాను. జీవితంలో మళ్లీ ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు'' అని తన మనసులోని మాటను బయట పెట్టారు. ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు ఉండటంతో రాజమౌళి కొత్త వారిని తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ తన కొత్త సినిమా చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయిని తెలిపాడు. ఆసక్తి ఉన్న వారికి తమ సినిమాలో అవకాశం ఇస్తానని, ఆసక్తి ఉన్నవారు వివరాలు పంపించాలని కోరాడు. ప్రభాస్ కు పత్యర్థిగా విలన్ పాత్రలో రాణా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను హైదరాబాద్‌కు తరలించనున్నారని కూడా సమాచారం.

No comments:

Post a Comment

Popular Posts