Search

Sunday, 20 January 2013

‘నాయక్’ కొత్త రికార్డ్ అన్న దానయ్య, క్షమాపణలు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రం 10 రోజులు పూర్తి చేసుకుని అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెలుతున్న నేపథ్యంలో నిర్మాత డివివి దానయ్య, సమర్పకుడు ఎస్ రాధాకృష్ణ హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మా సినిమా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెలుతోందని....10 రోజుల కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ సృష్టించిందని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్-వినాయక్ కెరీర్లోనే ఈచిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.


సినిమా విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతిల్లో విజయ యాత్ర నిర్వహిస్తున్నామని....రామ్ చరణ్, వినాయక్, ఆకుల శివ, రాధాకృష్ణ, తాను ఈ విజయాత్రలో పాల్గొంటున్నామన్నారు. ఒకే రోజు యాత్ర సాగనున్న నేపథ్యంలో ప్రత్యేక విమానంలో వెలుతున్నట్లు తెలిపారు. ‘నాయక్' సినిమాలో విలన్ పాత్రకు విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు పెట్టడంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు.....దానయ్య స్పందిస్తూ ఉద్దేశ్య పూర్వకంగా ఆయన పేరు పెట్టలేదని, కాకతాళీయంగా జరిగిందేనన్నారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు బాబ్జీకి క్షమాణ చెబుతున్నట్లు దానయ్య మీడియా ముఖంగా ప్రకటించారు.

No comments:

Post a Comment

Popular Posts