సొంత మైదానం రాంచీలో భారత జట్టు ఘన విజయం సాధించి సారథి మహేంద్ర సింగ్
ధోనీకి కిక్ ఇచ్చింది. సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ విజయం ద్వారా భారత్
ఐసిసి ర్యాంగింగ్స్‌లో నెంబర్ 1 స్థానం సాధించడం ధోనీకి డబుల్ కిక్
ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచులో ఇంగ్లాండు పైన భారత్ ఘన విజయం సాధించిన
విషయం తెలిసిందే.
శనివారం రాత్రి ఐసిసి ఐసిసి ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఐదు వన్డేల
సిరీస్‌లో ఇంగ్లాండుతో భారత్ తలపడుతోంది. ఐదు సిరీస్‌ల వన్డే
ప్రారంభమైనప్పుడు ఐసిసి ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉండగా..
ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు భారత్ మొదటి స్థానానికి వచ్చింది.
రాంచీలో ఓటమితో ఇంగ్లాండ్ మూడో స్థానానికి పడిపోయింది.
సాధారణంగా ఐసిసి ర్యాంకింగ్స్‌ను ఏదైనా సిరీస్ అయిపోయాక
ప్రకటిస్తారు. శనివారం దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్ మ్యాచులో కివీస్
ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఐసిసి ర్యాంకింగ్స్
ప్రకటించింది. భారత్‌తో ఇంగ్లాండు ఐదు సిరీస్‌ల మ్యాచు ప్రారంభించినప్పుడు
నెంబర్ వన్ స్థానంలో ఉంది.
మొహాలిలో గెలిస్తే ఓకే లేకుంటే అంతే...
భారత్ ఈ మ్యాచుతో మొదటి స్థానంలో నిలిచినప్పటికీ 23న మొహాలీలో జరిగే ఆటలోనూ
ఇంగ్లాండుతో గెలవాల్సి ఉంది. గెలిస్తేనే మొదటి ర్యాంక్‌ను
నిలబెట్టుకుంటుంది. ప్రస్తుతం భారత్ 119 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా
దక్షిణాప్రికా(118) రెండో స్థానంలో, ఇంగ్లాండు (116) మూడో స్థానంలో ఉంది.
ఒకవేళ మొహాలి మ్యాచ్ భారత్ ఓడిపోతే రెండు రేటింగ్స్ తగ్గి 117 అవుతాయి.
అప్పుడు ఇంగ్లాండ్ రేటింగ్ పాయింట్స్ పెరుగుతాయి. తద్వారా భారత్ మొదటి
స్థానాన్ని తిరిగి కోల్పోతుంది. ఆ తర్వాత 27న ధర్మశాలలో జరిగే మ్యాచులో
ధోనీ సేన మళ్లీ గెలిస్తే సిరీస్‌తో పాటు నెంబర్ వన్ స్థానాన్ని తిరిగి
చేజిక్కించుకుంటుంది.
జనవరి 19, 2013 ఐసిసి వన్డే ర్యాంకింగ్స్
1. భారత్ - 119
2. దక్షిణాఫ్రికా - 118
3. ఇంగ్లాండు - 116
4. శ్రీలంక - 111
5. ఆస్ట్రేలియా - 111
6. పాకిస్తాన్ - 107
7. వెస్టిండీస్ - 88
8. బంగ్లాదేశ్ - 78
9. న్యూజిలాండ్ - 76
10. జింబాబ్వే - 50
11. ఇర్లాండ్ - 35
12. నెదర్లాండ్స్ - 16
13. కెన్యా - 11
No comments:
Post a Comment