మేం కాపీ కొట్టాలని అలా చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది.
‘నాయక్'లోని కొన్ని సన్నివేశాలు గతంలో విజయవంతమైన కొన్ని చిత్రాలను
గుర్తుచేసే రీతిలో ఉన్నాయన్నది నిజమే. అయితే, అవన్నీ నా సినిమాల్లోని
సన్నివేశాలే. వేరే వాళ్ల సినిమాల్లోవి కావు. ఈ సినిమాలోని ఇంటర్వెల్
బ్యాంగ్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదు'' అన్నారు రచయిత ఆకుల శివ.
ఆయన కథ, సంభాషణలు సమకూర్చిన ‘నాయక్' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన విషయం
తెలిసిందే. ఆ సినిమాకు లభిస్తున్న స్పందన, భవిష్యత్ ప్రణాళికల గురించి శివ
మీడియాతో ముచ్చటించారు.
రామ్ చరణ్ ‘నాయక్'లోని కొన్ని సన్నివేశాలు గతంలో విజయవంతమైన కొన్ని
చిత్రాలను గుర్తుచేసే రీతిలో ఉన్నాయని కొందరి విమర్శ. దీనికి మీ సమాధానం?
అని రచయిత ఆకుల శివను మీడియావారు ప్రశించారు. దానికి ఆయన పాజిటివ్ గా
స్పందించారు. అయితే సెంట్రల్ పాయింట్ అనేది నా సినిమాల్లో ఎప్పుడూ
కొత్తగానే ఉంటుంది అన్నారు.
‘‘స్పీల్‌బర్గ్ తీసినట్టు మనం సినిమాలు తీయలేం. చలం రాసినంత అద్భుతంగా
సాహిత్యాన్ని రాయలేం. సృజన అనేది మన పరిధిని బట్టే ఉంటుంది. దానికి
అనుగుణంగానే అవుట్‌పుట్ ఉంటుంది. పరిధిని మించి ఆలోచించడం నా దృష్టిలో
కరెక్ట్ కాదు. ‘కొత్తదనం' అని చెప్పి అటు ప్రేక్షకులను, ఇటు తారలను
కన్‌ఫ్యూజ్ చేయడం శుద్ధ దండగ'' అంటున్నారు రచయిత ఆకుల శివ.
అలాగే ఈ సినిమా డబుల్ పాజిటివ్ చూసిన వెంటనే డైలాగులు బాగున్నాయని
చిరంజీవిగారు ప్రశంసించడం మరచిపోలేను. ఆయన హీరోగా నటించిన 'ఇంద్ర' సినిమా
రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేప్పుడే 'నువ్వు మంచి డైలాగ్ రైటర్‌వి
అవుతావు' అన్న ఆయన మాటలు నిజమయ్యాయి. చిరంజీవిగారి ‘ఇంద్ర' సినిమాలోని
‘మీది తెనాలే నాది తెనాలే' కామెడీ ట్రాక్ నేను రాసిందే. .'నాయక్'
విడుదలయ్యాక నా డైలాగ్స్ బాగున్నాయని మెచ్చుకుంటూ నాకు దాదాపు ఇరవై వేల
ఫోన్ కాల్స్ వచ్చాయంటే నమ్మాలి. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సురేశ్
గారబ్బాయి సాయి హీరోగా వినాయక్ డైరెక్ట్ చేయబోతున్న సినిమాకి
పనిచేస్తున్నా'' అని చెప్పారు శివ.
No comments:
Post a Comment