Search

Tuesday, 22 January 2013

రామ్ 'ఒంగోలు గిత్త' ఫిబ్రవరి 1 రిలీజ్

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెట్‌ పతాకంపై బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒంగోలు గిత్త' ఫిబ్రవరి 1న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''మా 'ఒంగోలు గిత్త' షూటింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని రూపొందించిన భాస్కర్‌ తీస్తున్న ఫ్యామిలీ టచ్‌తో వుండే మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రామ్‌ ఇమేజ్‌కి తగినట్టుగా ఎనర్జిటిక్‌గా వుంటూ అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వుంటాయి. రామ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమాగా మా 'ఒంగోలు గిత్త' నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.

రైజింగ్‌ స్టార్‌ రామ్‌, కృతి కర్బందా, ప్రకాష్‌రాజ్‌, ప్రభు, జె.పి., ఆలీ, ఆహుతి ప్రసాద్‌, రఘుబాబు, అజయ్‌, అభిమన్యు సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, మణిశర్మ, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: సెల్వ, ఫోటోగ్రఫీ: ఎ.వెంకటేష్‌, మాటలు: సురేంద్రకృష్ణ, ఆర్ట్‌: కె.కదిర్‌, పాటలు: వనమాలి, స్క్రీన్‌ప్లే: బి.భారతి, ఎడిషనల్‌ స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామ్‌ మోహన్‌రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ-దర్శకత్వం: భాస్కర్‌.

No comments:

Post a Comment

Popular Posts