Search

Tuesday, 22 January 2013

సన్నబడటం వెనుక వేరే కారణం ఉంది: ప్రియమణి

Priyamaniజాతీయస్థాయిలో ఉత్తమ నటి అనిపించుకున్న భామ ప్రియమణి. రగడ, రాజ్‌ చిత్రాల్లో గ్లామర్‌గా కన్పించింది. అయితే ప్రస్తుతం గతంలో కంటే సన్నబడింది. తాజాగా 'అంగుళీక' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర అరుంథతిలోని అనుష్క పాత్రను పోలి ఉంటుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లో షూటింగ్‌ జరుగుతోంది. ఒళ్ళు తగ్గించారేమిటని అడిగితే... అవకాశాలు లేక మాత్రంకాదు. కొంచెం సన్నబడితే మంచిదనీ, అంగుళీకలో పాత్ర కోసం అనుకోండని చెప్పింది. నేను ఎలా కన్పించినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు గనుక నేను చెప్పేస్తున్నానంది.

అంగుళీక గురించి చెబుతూ.. సూర్యభగవానుడి చుట్టూ నడిచే కథ. నా పాత్ర చుట్టూ ఆసక్తికరమైన కోణాలుంటాయని చెప్పింది. పెండ్లి గురించి చెబుతూ.. ఇప్పుడప్పుడే అలాంటి ఆలోచన లేదని దాటవేసింది.

No comments:

Post a Comment

Popular Posts