Search

Tuesday, 22 January 2013

2014 ఎన్నికల నాటికి చిరంజీవి 150వ చిత్రం రెడీ...? డైరెక్టర్ వినాయక్...?!

chiranjeeviమెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి గ్రౌండ్ వర్క్ జరుగుతోందా...? అంటే అవుననే అంటున్నారు. 2014 ఎన్నికల సమయం నాటికి చిరంజీవి తన 150వ చిత్రాన్ని చేయాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివి వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఇటీవల వినాయక్ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం సందర్శించిన సమయంలో చిరంజీవి కోసం శక్తివంతమైన కథను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఠాగూర్ చిత్రం ఎంతటి రేంజ్ లో సక్సెస్ అయిందో అదే స్థాయిలో స్క్రిప్టు ఉండాలని చిరు చెప్పినట్లు సమాచారం.

కాగా వినాయక్ దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలయిన నాయక్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి సక్సెస్ చవిచూసింది. మొదటివారంలోనే ప్రపంచవ్యాప్తంగా నాయక్ 34 కోట్ల రూపాయల షేరును వసూలు చేసింది.

No comments:

Post a Comment

Popular Posts