త్వరలో
పవన్ కళ్యాణ్ చెట్టుక్రింద ప్లీడర్ గా కనిపించబోతున్నాడంటూ వార్తలు
వినిపిస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తాజాగా పవన్ ఓ చిత్రం ఓకే చేసిన
సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ పాత్ర పెద్దగా ప్రాక్టీస్ లేని ఓ లాయిర్
పాత్ర అని తెలుస్తోంది. వినపడుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా
సంచలనం సృష్టించిన ఓ కేసు విషయంలో ప్రజాపక్షాన నిలిచి న్యాయాన్ని
గెలిపించటం కధాంశమని చెప్తున్నారు.
ఈ స్టోరీ లైన్ నచ్చి వెంటనే స్ట్రిప్ట్ రెడీ చేయమని క్రిష్‌ని పురమాయించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించనున్నారనే వార్త ఇటీవలే వినిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే పవర్‌స్టార్ లాయర్‌గా కనిపించబోతున్నారని ఫిలింనగర్ సమాచారం. పవన్ ఎప్పుడూ విభిన్నమైన స్క్రిప్టులకు ప్రాధాన్యత ఇస్తారనే సంగతి ఈ విషయంతో మరోసారి రుజువైంది.
గతంలో ఎన్టీఆర్ హీరోగా లాయిర్ విశ్వనాధ్ చిత్రం కూడా ఇలాంటి కథాంశంతోనే వచ్చింది. అలాగే రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ దర్శకత్వంలో వచ్చిన చెట్టు క్రింద ప్లీడర్ చిత్రం కూడా ఇలాంటి ఓ సున్నితమైన ఇష్యూని డీల్ చేస్తూ సాగుతుంది. అలాగే చిరంజీవి అభిలాష చిత్రంలో కూడా లాయిర్ గా కనిపించి ఓ బర్నింగ్ టాపిక్ ఇష్యూపై ఆయన పోరాటం చేస్తారు. ఇలాంటి కథలో సామాజిక సందేశం తో పాటు జనాల్ని చైతన్యం చేసే అవకాసం కూడా ఉంటుందని పవన్ భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ ...ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రిష్, సంపత్‌నంది చిత్రాల్లో నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు సెట్స్‌కి వెళతుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

No comments:
Post a Comment