ఈ విషయాన్ని డిల్లీకి చెందిన ఓ డైలితో విక్రమ్ ఖరారు చేసి చెప్పారు. రజనీతో చేసిన రోబో కన్నా ఈ బడ్జెట్ ఎక్కువ. ఈ చిత్రం త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక్కడ ఓ పాట,కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఇరవై రోజులు షెడ్యూల్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
శంకర్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే. ఈ నేపధ్యంలో ఈ రిపీట్ కాంబినేషన్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ఐ చిత్రం కాన్సెప్ట్ పై రకరకాల కథనాలు వినపడుతున్నాయి. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది.
ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.
No comments:
Post a Comment