యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ‘బాద్ షా' చిత్రం ప్రస్తుతం స్పెయిన్లో
జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జూ ఎన్టీఆర్-కాజల్ పై పాటల చిత్రకరణ
జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా
తెరకెక్కిస్తున్నారు. మరో వైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్
హీరోగా రూపొందుతున్న ‘ఇద్దరమ్మయిలతో' చిత్రం షూటింగ్ కూడా స్పెయిన్లోనే
జరుగుతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు నిర్మాత బండ్ల గణేష్
కావడం. ఈ రెండు చిత్రాల్ని ఆయన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై
నిర్మిస్తున్నారు.
రెండు సినిమాల షూటింగులు ఓకే ప్రాంతంలో జరుగుతుండటంతో ‘బాద్ షా' మూవీ యూనిట్ సభ్యులైన హీరో జూ ఎన్టీఆర్, దర్శకుడు శ్రీను వైట్ల, హీరోయిన్ కాజల్ ‘ఇద్దరమ్మాయిలతో' షూటింగ్ లొకేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అంతా కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

No comments:
Post a Comment