దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 26/11 ముంబై దాడుల సంఘటనపై సినిమా
రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘ద అటాక్స్ ఆఫ్ 26/11' పేరుతో
రూపొందుతున్న ఈచిత్రాన్ని తెలుగులో ‘26/11 ఇండియాపై దాడి' పేరుతో
విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ముంబై దాడుల సంఘటనలను కళ్లకు కట్టినట్లు
చూపెట్టనున్నారు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన బడ్జెట్ వివరాలు బయటకు లీకయ్యాయి. బడ్జెట్ దర్శకుడిగా, తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకు మాత్రం భారీగానే ఖర్చు పెట్టించాడట. బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి వర్మ రూ. 25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
కేవలం
తాజ్ హోటల్ సెట్ వేయడానికే రూ. 4 కోట్ల వరకు ఖర్చయిందట. అదే విధంగా ముంబై
సిఎస్‌టి స్టేషన్లో పర్మీసన్ కోసం కూడా భారీగానే ఖర్చయింది. సిఎస్‌టి
స్టేషన్లో దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్లు చిత్రీకరించారట.
సినిమా మొత్తం రియల్ సంఘటనలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండనుంది.
మానవ చరిత్రలో న్యూయార్క్ లో జరిగిన 9/11 తీవ్రవాదుల దాడుల కంటే భయంకరమైనవి ఎప్పుడూ జరగలేదు. కానీ జరిగిన తీరులో 26/11 ముంబయ్ దాడులు వాటికంటే భయంకరమైనవి. నా చిత్రంలో ముంబయ్ దాడుల వెనుక అసలు కథ, వాటిలో పాలుపంచుకున్న వ్యక్తుల భావోద్వేగాలను తెరకెక్కించాను అంటున్నారు దర్శకుడు వర్మ. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1, 2013న ఈ చిత్రం విడదల కానుంది.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన బడ్జెట్ వివరాలు బయటకు లీకయ్యాయి. బడ్జెట్ దర్శకుడిగా, తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకు మాత్రం భారీగానే ఖర్చు పెట్టించాడట. బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి వర్మ రూ. 25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
మానవ చరిత్రలో న్యూయార్క్ లో జరిగిన 9/11 తీవ్రవాదుల దాడుల కంటే భయంకరమైనవి ఎప్పుడూ జరగలేదు. కానీ జరిగిన తీరులో 26/11 ముంబయ్ దాడులు వాటికంటే భయంకరమైనవి. నా చిత్రంలో ముంబయ్ దాడుల వెనుక అసలు కథ, వాటిలో పాలుపంచుకున్న వ్యక్తుల భావోద్వేగాలను తెరకెక్కించాను అంటున్నారు దర్శకుడు వర్మ. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1, 2013న ఈ చిత్రం విడదల కానుంది.
No comments:
Post a Comment