ఇక మిర్చి లో వెన్నెల పాత్రలో ఆకట్టుకున్నారని అందరూ అంటుంటే ఒళ్లుపులకరిస్తుంది. ఈ పాత్ర నాకు చాలా లక్కీగా దొరికింది. చాలాకాలం తర్వాత వినోదాన్ని పండించే పాత్ర అందులోనూ పరికిణి గురించి అందరి దగ్గ రినుంచి చాలా ప్రశంసంలు వస్తున్నందున ఆనందంగా వుంది. శివగారు బేసిక్‌గా రచయిత కావడం వల్ల అనుభవమున్న దర్శకుడిలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో పూర్తిగా కథనుంచే సంభాషణలన్నీ చక్కగా రాశారు. ప్రేమానురాగాలకు ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం అంటూ వివరించింది.
భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెప్తూ...కహానీ రీమేక్ చిత్రంలో నటించమని శేఖర్ కమ్ముల నన్ను అడిగారు. కాల్షిసట్ స ర్దుబాటు కాక చేయలేదు. అయినా అన్ని సినిమాలకు నేనే చేయాలని లేదు కదా. ప్రస్త్తుతం రుద్రమదేవి, బహుబలి సినిమాలు ఒప్పుకున్నాను. వాటిపైనే దృష్టి పెట్టాలి. ఒక సినిమా అంగీకరించే ముందు కథకే ప్రాధాన్యతనిస్తాను. కథ ప్రకారమే పాత్రలు ఉంటాయి. ఇక కాంబినేషన్ సినిమాలంటే తొలుత స్కిప్ట్ బావుండాలి అప్పుడే అవి విజయం సాధించే అవకాశం ఉంటుంది అని అనుష్క పేర్కొంది.
అనుష్క అచ్చ తెలుగు అమ్మాయిలా పట్టు పరికిణితో కనిపించిన చిత్రం ఇటీవలే విడుదలైన మిర్చి. ఈ చిత్రాన్ని ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌లు నిర్మించారు. తన పాత్రకు మంచి స్పందన లభిస్తోంది అనుష్క తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సినిమా విజయానికి నిర్మాణ విలువలు, దర్శకుడి ప్రతిభ మీదే ఆధారపడి వుంటుంది అని అంది.
No comments:
Post a Comment