నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు అగ్రనేత దివంగత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ ఉద్యమ పోరాటాన్నీ తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. కిషన్‌జీ జీవితం, చేపట్టిన ఉద్యమాన్ని అందులో చూపిస్తామనీ, తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం ఉంటుందనీ ఆయన చెప్పారు.
ఇక ఈ మధ్యనే...ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'పీపుల్స్ వార్'. బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లకు వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది. సోంపేట, కాకరాపల్లి తదితర గ్రామాల ప్రజలు థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని ఎంచుకొని రాసుకొన్న కథే ఇది. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులే ఇందులో హీరోలు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలే ఈ చిత్రంలో విలన్లు . శ్రీహరి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు.
No comments:
Post a Comment