సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు,ఇంద్ర వంటి మెగా హిట్ చిత్రాలు
రూపొందించిన బి.గోపాల్ చిత్రాలు అంటే ప్రేక్షకులలో ఆసక్తే. ఆయన రామ్ తో
చేసిన మస్కా తర్వాత ఏ చిత్రమూ చేయలేదు. తాజాగా మరో చిత్రం కమిటయినట్లు
సమాచారం. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా చేయటానికి ఆయన గ్రీన్
సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ప్రస్తుతం గోపీచంద్ ప్రస్తుతం 'జాక్‌పాట్' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరవాత నటించే చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
నిజానికి 2010లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంది. అప్పుడే మస్కా రైటర్ చెప్పిన కథని బి.గోపాల్ ఓకే చేసి గోపీచంద్ తో సినిమా అనుకునన్నారు. అప్పట్లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ తెరకెక్కుతుందని తెలుస్తోంది.
తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు.
మరో ప్రక్క గోపీచంద్, తాప్సీ జంటగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొత్తానికి పూర్తైంది. రీసెంట్ గానే ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో చేసారు. దాంతో టాకీ ఆల్ మోస్ట్ ఫినిష్ అయినట్లు చెప్తున్నారు.

No comments:
Post a Comment