రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి బాంబు పేలుళ్ల ధాటికి గిజగిజలాడింది.
హైదరాబాదులో దిల్‌షుక్‌నగర్‌లో ప్రాంతం వరుస పేలుళ్లతో రక్తసిక్తమైంది.
అమాయమైన ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పెక్కురు ఆస్పత్రుల్లో చికిత్స
పొందుతున్నారు. తమ వారి కోసం ప్రజలు అంగలారుస్తున్నారు. ఆస్పత్రుల చుట్టూ
తిరుగుతూ తమ ఆత్మీయుల కోసం వెతుకుతున్నారు.
2007లో రెండు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ముందుగా మక్కా మసీదులో మొదట బాంబులు పేలాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే కోఠిలోని గోకుల్ చాట్, సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో పేలుళ్లు సంభవించాయి. గోకుల్ చాట్, లుంబినీ పార్కు ఘటనలతో హైదరాబాదు వణికిపోయింది.
- 1997 నవంబర్ 20వ తేదీన జూబ్లీహిల్స్‌లో తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి లక్ష్యంగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 23 మంది చనిపోయారు. 31 మంది గాయపడ్డారు. రాయలసీమ ఫాక్షన్ కక్షల నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది.
- 2002 నవంబర్ 21వ తేదీన దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబ దేవాలయం వద్ద పేలుడు సంభవించింది. ఇందులో ఒక మహిళ మరణించింది. 22 మంది గాయపడ్డారు.
- 2004 నవంబర్ 1న సరూర్‌నగర్ దగ్గర పార్కు చేసిన ఇంజనీరింగ్ కళాశాల బస్సు కింద బాంబు పేలి ఇద్దరు గాయపడ్డారు.
- 2004 నవంబర్ 12న జామే ఉస్మానియా సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన బాంబు పేలుడు సంఘటన చోటు చేసుకుంది.
- 2005 ఏప్రిల్ 14న నెక్లెస్ రోడ్డు సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన బాంబు పేలింది.
- 2005 అక్టోబర్ 12న బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఒక హోంగార్డు మరణించగా, మరో కానిస్టేబుల్ గాయపడ్డాడు.
- 2006 మే 7వ తేదీన హైదరాబాదులోని ఓడియన్ థియేటర్‌లో బాంబు పేలుళ్లు సంభవించి ఓ యువతి సహా ముగ్గురు గాయపడ్డారు.
- 2006 మే 11వ తేదీన బంజారాహిల్స్ సమీపంలోని ఇందిరానగర్‌లోని ఓ ఇంట్లో చెత్త సామాగ్రి తొలగిస్తుండగా ఒక బాక్సులోని బాంబు పేలింది. మరో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.
- 2007 మే 1న మలక్‌పేటలో లెటర్ పార్శిల్ బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఓ మహిళ గాయపడింది.
- 2007 మే 18న పాతబస్తీ మక్కా మసీదులో బాంబులు పేలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. పోలీసులు మరో మూడు బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు.
- 2007 ఆగస్టు 25వ తేదీన లుంబినీ పార్కు, కోఠీలోని గోకుల్ చాట్‌ల్లో సంభవించిన పేలుళ్లలో 42 మంది మరణించారు. దిల్‌షుక్ నగర్ ఫుటోవర్ బ్రిడ్జి కింద పోలీసులు ఓ బాంబును గుర్తించారు.

No comments:
Post a Comment