Search

Friday, 15 February 2013

మహేష్ సినిమా కథ 1950లో జరుగుతుంది

Mahesh Babu Krish Movie Be Period Film మహేష్ త్వరలో చేయబోయే శివం చిత్రం 1950లో జరుగుతుంది. ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షినే తీసుకోవాలని ప్రత్యేకంగా అనుకోవటానికి కారణం చెప్తూ ఈ విషయం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ఈ సినిమా 1950లో జరుగుతుంది. ఈ కథలో హీరోయిన్ పాత్ర సినిమాకు చాలా కీలకం. ఈ సినిమా కోసం హీరోయిన్ పాత్ర రాసుకుంటూంటే నా మనస్సులో సోనాక్షినే మెదిలింది. సినిమా లో ఆమెపాత్ర పేరు మీనాక్షి అన్నారు.
అలాగే సోనాక్షి అందంగా ఉండటమే కాక అందమైన కళ్లు ఉండాలి. నేను దబాంగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని పవర్ ఉంది. ఆ కళ్లు చాలా ఎక్సప్రెసివ్ గా ఉంటాయి అంటూ ఆయన వివరించారు. ఈ సంవత్స రం లోనే సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం అశ్వనీదత్ నిర్మించనున్నారు. సుకుమార్ చిత్రం షూటింగ్ పూర్తవగానే ఈ చిత్రం పూర్తవుతుంది. క్రిష్ చిత్రం పూర్తయ్యాక శ్రీనువైట్లతో చేసే ఆగడు ప్రారంభమవుతుంది.
సోనాక్షి ట్విట్టర్ లో... ''అవును. నేను మహేష్‌తో నటిస్తున్నా. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. అందులో నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. తొలిసారి తెలుగులో, అందులోనూ మహేష్‌ బాబు లాంటి హీరోతో నటించడం ఆనందంగా ఉంది''అని రాసుకొంది సోనాక్షి. ఇక ఈ చిత్రానికి సి.అశ్వనీదత్‌ నిర్మాత.
ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు స్పష్టం చేసిన క్రిస్... ఈ ఏడాది సమ్మర్లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ నేపథ్యంలో రూపొందించేందుకు దర్శకడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈచిత్రానికి ‘శివం' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది.
గతంలో ఓసారి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు, అతనితో నటించే అవకాశం వస్తే తెలుగులో సినిమా చేయడానికి రెడీ అంటూ బదులిచ్చిన సంగతి తెలిసిందే. . ఇక పోతే క్రిష్ దర్శకత్వం వహించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం బాక్సాఫీసు వద్ద సరైన ఫలితాలను ఇవ్వలేదు.

No comments:

Post a Comment

Popular Posts