టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ను
ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్
చేసిన సంగతి తెలిసిందే. సమంతను హీరోయిన్‌గా చాలా రోజుల క్రితమే ఎంపిక
చేసారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్ లో
జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంబోత్సవ కార్యక్రమానికి దాసరి నారాయణరావుతో పాటు, రాఘవేంద్రరావు, వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరో వైపు బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ నెట్కర్కింగ్ పేజ్ ద్వారా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్స్ ను విడుదల చేసారు.
వివి వినాయక్ దర్శకత్వం కావడం, సమంత హీరోయిన్ గా చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ పరంగా ఫర్వాలేదనిపిస్తున్నాడు. మరి వెండితెరపై ఏ మేరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.

No comments:
Post a Comment