అయితే ఈ సినిమాలో హర్భజన్ పాత్ర ఏమిటనే విషయం ఇప్పటి వరకు బయటకు రాక పోయినప్పటికీ....ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. భజ్జీ పోషిస్తున్న పాత్ర ఏమిటో బయటికి తెలియకుండా దర్శక నిర్మాతలు సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. ఏది ఏమైనా భజ్జీ తొలిసారిగా వెండితెరపై కనిపిస్తుండటంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఐపీఎల్-6 సీజన్ కంటే ముందే షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పంజాబీ యాక్టర్స్ జిప్పీ గ్రేవాల్, గుర్పీత్ తదితరులతో కలిసి హర్భజన్ షూటింగులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి అశ్విని యార్ది మాట్లాడుతూ....భజ్జీ పాత్ర ఆయన అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని వెల్లడించారు.
గ్రాజింగ్ గోట్ పిక్చర్స్ గతంలో ‘ఓ మై గాడ్' అనే హిందీ చిత్రంతో పాటు, మరాఠీలో ‘72 మైల్స్' చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు ‘భా జీ ఇన్ ప్రాబ్లమ్' అనే చిత్రం ద్వారా పంజాబీ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోంది.
No comments:
Post a Comment