మరో ప్రక్క వీరప్పన్ నలుగురు అనుచరుల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించడం పట్ల అంతర్జాతీయ కారుణ్య సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' ఆందోళన వ్యక్తం చేసింది. వారికి శిక్ష విధించడాన్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
తన భర్తను ఉరితీస్తే కుటుంబంతో సహ ఆత్మహత్యకు పాల్పడతానని వీరప్పన్ అనుచరుడు మాదయ్య భార్య తంగమ్మాల్ పేర్కొంది. 1993లో తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని పాలార్ వద్ద మందు పాతర పేల్చి 21 మందిని బలితీసుకున్న కేసులో వీరప్పన్ అనుచరులు జ్ఞానప్రకాశం, సియోన్, మాదయ్య, జితేందర్‌లకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. వీరు పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు.
దీంతో మాదయ్య భార్య తంగమ్మ మాట్లాడుతూ.. భర్తకు ఉరిశిక్ష విధిస్తే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. మరోవైపు, వీరప్పన్ అనుచరులకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ వీసీకే అధినేత తిరుమావళవన్, పీఎంకే నేత రామదాసు డిమాండ్ చేశారు. వీరప్పన్ సహచరులైన నలుగురికి ఉరి వేసేందుకు అధికారులు ఇక్కడి హిండలగా జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉరి రిహార్సల్స్ నిర్వహించారు. ఉరిశిక్షను ఎప్పుడు అమలు చేసేదీ వెల్లడించేందుకు జైలు అధికారులు నిరాకరించారు.
No comments:
Post a Comment