Search

Wednesday, 23 January 2013

మహేష్ బాబును చూస్తే సమంతకు భయమా..? ఎందుకు...?

Samanthaసూపర్ స్టార్ మహేష్ బాబును చూస్తే తెగ భయపడేదాన్నని చెపుతోంది సమంత. ఐతే అది దూకుడు సినిమా టైంలోనే కానీ ఇప్పుడు అటువంటిదేమీ లేదని చెపుతోంది సమంత. ప్రతి చిత్రాన్ని మొదటి చిత్రంగా ఫీలయి చేయమని మహేష్ సార్ చెప్పారనీ, అప్పట్నుంచి అలాగే ఫీలవుతూ చేస్తుంటానని అంది ఎర్రటి పెదవులను సాగదీస్తూ. అంతేకాదు మీడియాలో తన ఫోటోలను ఎక్కువగా చూసుకునేందుకు ఆట్టే ఇష్టపడదట సమంత.

తనగురించి ఎవరైనా ఏవిధంగానైనా రాసినా తనకు ఇష్టముండదని చెబుతోంది. పబ్లిసిటీ అంటే దూరంగా ఉంటానంది. సినిమా చేశాక రియల్‌ లైఫ్‌లోకి వెళ్ళిపోతానంటోంది. చక్కగా ఇంటిలో అందరితో గడుపుతాను అంది. రోజు పేపర్లో నా ఫొటో చూసుకోవడానిక్కూడా నాకు ఇష్టం ఉండదని చెప్పింది.

'సీతమ్మ వాకిట్లో..' సినిమాను హైదరాబద్‌ సినీమ్యాక్స్‌లో చూశాను. నా పక్కనే 50 ఏళ్ల ఆంటీ.... ఎంతో ఫీలయి మంచి సినిమాలో చేశావని మెచ్చుకుంది. నేను కూడా సినిమా చూశాక.. ఇలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుండేదని అనిపించిందని చెప్పింది.

No comments:

Post a Comment

Popular Posts