Search

Wednesday, 23 January 2013

'జబర్‌దస్త్‌' రీలాంచ్‌లా ఉందంటున్న సిద్ధార్థ్‌!

చాలాకాలం తర్వాత సిద్ధార్థ్ మళ్ళీ తెలుగులో రీలాంచ్‌ అవుతున్నట్లు ఫీలవుతున్నానని చెబుతున్నాడు. నందినిరెడ్డికి థ్యాంక్స్‌ కూడా చెప్పాడు. ఆమె దర్శకత్వంలో నిత్యమీనన్‌, సమంత హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'జబర్‌దస్త్‌'. బెల్లంకొండ సురేష్‌ నిర్మాత.

ఈ చిత్రం షూటింగ్‌ ముగింపుదశలో ఉంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రం రషెస్‌ చూశాక సిద్ధార్థ్‌ తన మనసులోని మాటను ట్విట్టర్‌లో పొందుపర్చాడు. ఇది నందినీరెడ్డి ఎంటర్‌టైనర్‌.

నన్ను మళ్ళీ తెలుగులో రీఎంట్రీగా చూపించే సినిమాగా తీర్చిదిద్దారు. ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రం ఆడియోను ఈనెల 27న విడుదల చేయనున్నారు. థమన్‌ మ్యూజిక్‌ అందించారు.

No comments:

Post a Comment

Popular Posts