కింగ్ నాగార్జున
'గ్రీకువీరుడు'గా కనిపించబోతున్నాడు. కామాక్షి మూవీస్ పతాకంపై అల్లరి
అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను
నిర్మించిన అగ్రనిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి కింగ్ నాగార్జున హీరోగా
నిర్మిస్తున్న తాజా చిత్రానికి 'గ్రీకువీరుడు' టైటిల్ కన్‌ఫర్మ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ - ''మా సబ్జెక్ట్‌కి, నాగార్జునగారి ఇమేజ్‌కి పర్‌ఫెక్ట్‌గా 'గ్రీకువీరుడు' టైటిల్ యాప్ట్‌గా వుంటుందని ఈ టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశాం. నాగార్జున సరసన నయనతార నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది.
నాగార్జునగారితో 'సంతోషం' వంటి సూపర్‌హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన దశరథ్ 'గ్రీకువీరుడు' చిత్రాన్ని మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు, నాగార్జునగారి అభిమానులకు నచ్చే అన్ని అంశాలు 'గ్రీకువీరుడు'లో వుంటాయి'' అన్నారు.
దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ - ''అమెరికాలోనే పుట్టి పెరిగిన హీరో ఎన్‌ఆర్‌ఐగా ఫస్ట్‌టైమ్ ఇండియా వస్తారు. అతను ఎక్స్‌పీరియన్స్ చేసిన కొన్ని అనుభవాలతో ఈ కథ రూపొందించడం జరిగింది. శివప్రసాద్‌రెడ్డిగారి బేనర్‌లో సినిమా చెయ్యాలన్న కోరిక నాకు ఎప్పటి నుంచో వుంది. ఇన్నాళ్ళకు అది నెరవేరినందుకు చాలా ఆనందంగా వుంది.
నాగార్జునగారు చేసిన సంతోషం, మన్మథుడు తరహాలో వుండే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సంతోషం తర్వాత నాగార్జునగారితో మళ్ళీ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. 'గ్రీకువీరుడు'లో నాగార్జునగారు చాలా కొత్తగా వుంటారు. అలాగే కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది'' అన్నారు.
కింగ్ నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ భండారి, సంగీతం: థమన్ ఎస్.ఎస్., ఆర్ట్: ఎస్.రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కో-డైరెక్టర్: కె.సదాశివరావు, స్క్రీన్‌ప్లే: హరికృష్ణ, అడిషనల్ స్క్రీన్‌ప్లే: ఎం.ఎస్.ఆర్., ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో-ప్రొడ్యూసర్: డి.విశ్వచందన్‌రెడ్డి, నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

No comments:
Post a Comment