ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాప్సీ ఆ చిత్రం నుంచి తప్పుకుంది. కాంచనలో చేసిన లక్ష్మీరాయ్‌ను మళ్ళీ లారెన్స్ తీసుకున్నాడు. ముని, కాంచన కంటే ముని-3 చిత్రం ఇంకా ఆసక్తికరంగా, భయంగొలిపే విధంగా ఉంటుందని లారెన్స్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు.
గతంలో ఈ పాత్ర గురించి తాప్సీ.. ఇది నాకు చాలెంజింగ్ రోల్. నేను చేస్తానా లేదా అనే డౌట్ కూడా వచ్చిందని లారెన్స్ చేయగలమని ఒప్పించాడని అంది. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడటంలేదు. కాగా, కాంచన తర్వాత లారెన్స్‌కు, లక్ష్మీరాయ్‌కు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ సంఘటనతో అది మరింత బలపడినట్లయింది.
No comments:
Post a Comment